ఆ కుర్రాడిని తుపాకి బాయ్ నెట్ కత్తిని అలా చేత్తో రాస్తూ అది ఎంత చల్లగా ఉందో, ఎంత రాక్తదాహంతో పదునుగా ఉందో వెర్రివాడి చేతిలో రాయిలా, అసూయతో పచ్చబారిందో, మాంసానికి అలమటిస్తూ సన్నగా తీర్చబడిందో తెలుసుకోనీండి.
యువకుల గుండెల్లో ఒదగాలని తపించే, మొండి, విచక్షణ ఎరుగని సీసపుగుళ్ళని ఇచ్చి లాలనగా నిమరనీండి లేదా వాళ్ళకి పదునైన జింకు గుళ్ళని సరఫరా చెయ్యండి అవి దుఃఖమూ, మృత్యువంత పదునుగా ఉండాలి.
అతని దంతాలు ఆపిలుపండు కొరుకుతూ ఆనందంగా ఉండదగ్గవి అతని సున్నితమైన చేతివేళ్ల వెనుక ఏ పక్షిగోళ్ళూ లేవు అతని కాలివేళ్లకి దైవము ఏ పదునైన డేగగోళ్ళూ మొలిపించదు అతని దట్టమైన ఉంగరాలజుట్టులోంచి ఏ కొమ్ములూ మొలవవు. . విల్ఫ్రెడ్ ఓవెన్ (18 March 1893 – 4 November 1918) ఇంగ్లీషు కవి
.
.
Arms and the Boy
Let the boy try along this bayonet-blade
How cold steel is, and keen with hunger of blood;
Blue with all malice, like a madman’s flash;
And thinly drawn with famishing for flesh.
Lend him to stroke these blind, blunt bullet-leads