1915 లో Spoon River Anthology అన్న పేరుతో Edgar Lee Masters సంకలనం ప్రచురించి ఒక అద్భుతమైన ప్రయోగం చేశాడు. ఆయన స్వంత ఊరుకి దగ్గరగా ప్రవహిస్తున్న Spoon River పేరుతో ఒక నగరాన్ని కల్పనచేసి, ఆ నగర ప్రజలలో 212 మంది మృతులు తమ జీవితాలగురించి తామే చెబుతున్నట్టుగా 244 సంఘటనలను ప్రస్తావిస్తూ కవితలు వ్రాసాడు. అమెరికను నగరాల గురించి, పల్లెల గురించి ప్రజలలో ఉన్న కొన్ని భ్రమలని తొలగింపజెయ్యడమే ఈ సంకలనం ముఖ్యోద్దేశం.
***
నా పేరు మినర్వా, నేనొక జానపద కవయిత్రిని
వీధిలో అల్లరిచిల్లరగా తిరిగే పోకిరీవాళ్ళు
నా భారీశరీరానికీ, మెల్ల కళ్ళకి, కాళ్ళీడ్చి నడవడానికీ
నన్ను వెక్కిరించేవాళ్ళు. అన్నిటికీ మించి ఆ దుర్మార్గుడు
వెల్డీ నన్ను దారుణంగా వెంబడించి మరీ చెరిచాడు.
డాక్టర్ మేయర్స్ దగ్గర నా ఖర్మకి నన్ను విడిచిపెట్టాడు.
పాదాలదగ్గరనుండి పై వరకూ స్పర్శకోల్ఫోతూ క్రమక్రమంగా
మంచులోకి కూరుకుపోతున్నట్టూ, మృత్యుకుహరంలోకి ప్రవేశిస్తున్నట్టూ ఉంది.
దయచేసి ఎవరైనా ఈ పల్లెలోని పాత వార్తాపత్రికలు సంపాదించి
అందులో నేను వ్రాసిన కవితల్ని కవితల్ని సంకలించరూ?
నేను ప్రేమ కోసం అంతగా ప్రాకులాడేను!
నేను జీవితంకోసం అంతగానూ తపించేను!
.
ఎడ్గార్ లీ మాస్టర్స్
(August 23, 1868 – March 5, 1950)
అమెరికను కవి
.
.
Minerva Jones
.
I am Minerva, the village poetess,
Hooted at, jeered at by the Yahoos of the street
For my heavy body, cock-eye, and rolling walk,
And all the more when “Butch” Weldy
Captured me after a brutal hunt.
He left me to my fate with Doctor Meyers;
And I sank into death, growing numb from the feet up,
Like one stepping deeper and deeper into a stream of ice.
Will some one go to the village newspaper,
And gather into a book the verses I wrote?—
I thirsted so for love!
I hungered so for life!
Edgar Lee Masters
(August 23, 1868 – March 5, 1950)
American Poet
స్పందించండి