ఎక్కడ గులాబి ఉందో అక్కడ పిల్లతెమ్మెర ఉంది ఎక్కడ చక్కని గడ్ది ఉందో అక్కడ మంచుసోన ఉంది ఇక దొంతరదొంతరలుగా మేఘమాలికలు అంతుదొరకని వినీల విహాయస వీధుల్లో “లార్క్” తోపాటు విహరిస్తూనే ఉన్నాయి.
చెయ్యి ఎక్కడ ఉందో అక్కడ వేడి లేదు జుత్తు ఎక్కడ ఉందో అక్కడ పసిడివెలుగు లేదు ఏకాకిగా, దెయ్యంలా ముళ్ళపొదలక్రింద ప్రతి ముఖం ప్రేతకళ సంతరించుకుని ఉంది
ఎక్కడ మాటవినవస్తోందో, అక్కడ చలిగాలి వీస్తోంది నాగుండె ఎక్కడ ఉందో అక్కడ కన్నీరే కన్నీరు ఇక నా విషయానికి వస్తే ఏమి చెప్పమంటావు బిడ్డా!ఎప్పటిలాగే ఎక్కడ ఆశ అల్లుకుందో అక్కడ నిశ్శబ్దం తాండవిస్తోంది. .