ఈ పద్యంలో చెప్పిన కుర్రాడు ఎవరో కాదు: నేనూ, మీరూ, మనమందరమూను. అకస్మాత్తుగా మనకి తెలియని ఏదో చోటునుండి అదృష్టం కలిసివచ్చి లాభపడాలని అంతరాంతరాల్లో ఆశపడుతూ ఉండే మన మనఃప్రవృత్తిని బాగా పట్టిచూపించిన వ్యంగ్య కవిత ఇది.
***
డబ్బు చెట్లకి కాస్తే
అప్పుడెంత ఆనందంగా ఉంటుంది!
పిల్లలు డబ్బులో పొర్లుతారు
తండ్రులు ఊడ్చి తెచ్చి పడేస్తుంటారు.
చెట్లకొమ్మల్లో ఉన్న పెట్టుబడులు
పెద్ద లాభాలు ఆర్జిస్తుంటాయి
చెట్లు సంపదని అలా రాలుస్తుంటే
మనదగ్గరా తగలేయగలిగినంత డబ్బుంటుంది
ఐనప్పటికీ , శిశిరఋతువులో రాలిన ఆకుల్లా
పేదవాళ్లు మాత్రం పేదగానే మిగలడం చూడొచ్చు.
చెట్లనుండి రాలిన విలువలేని పెట్టుబడులు
గుమ్మం ముందునుండి అవతలకి తుడిచిపారెస్తాం.
అయితే, ప్రతిరోజూ కిటికీలోంచి
దూరంగా బంగారులోకాల గురించి
కలగంటూ ఉపాధ్యాయులచే తిట్లుతింటూ
ప్రతిరోజూ బడి వదిలిన తర్వాత
అతని ఒంటరి మధ్యాహ్నాలలో
ఇల్లంతా కెంపులకోసం, బంగారు
నాణాలకోసం తెగ గాలించి వెదికే
ఆ కుర్రాడి సంగతి ఏమయినట్టు?
అతను ఇప్పటికీ గాలికి
అల్లల్లాడే ఆకుల చప్పుడు వింటుంటాడు
ఆ గాలికి అకస్మాత్తుగా రాలబోయే
సంపదలగురించి కలగంటుంటాడు.
.
గ్రెగ్ విలియమ్ సన్
జననం 1964
అమెరికను కవి

Born 1964
స్పందించండి