నేను న్యూ మెక్సికోగుండా కారు నడుపుకుంటూ వెళుతున్నాను
మాటవరసకి, ఎదురుగా అస్తమసూర్యుడి అందాలు చూసుకుంటూ.
కానీ నేను శాంతా ఫే చేరుకునే లోపు, ఇదిగో
ఓ అపరిచితుడా, నువ్వు కనిపిస్తున్నావు,
నీ పెద్ద బుర్రతో, టన్ను బరువున్న SVVతో,
బంగారు రంగు అస్తమసూర్యుడి గురించి పట్టించుకోకుండా.
99 శాతం ఖచ్చితంగా చెప్పగలను … నువ్వు సెల్ ఫోనులో
మాటాడుతున్నావని… ఏమనుకోపోతే దాన్ని పక్కనబెడతావా?
నేను బయట భోజనం చేస్తున్నాను…అలసిన మెదడుకణాలు
ఏకశృతిలోకి రావడానికి ఉత్తమమార్గం
చేపలకూర తింటూ, మెర్లోట్ సేవించడం.
కానీ నువ్వు అక్కడకూడా దాపురించావు చెవిలో
నీ సెల్ ఫోను పెట్టుకుని, ఆ ఆటలు ఎలా గెలిచారో,
స్టాక్ మార్కెట్టు పడిపోయిందనో, బుల్లిష్ గా ఉందనో.
మొత్తం నీ జీవితమంతా ఊరందరికీ వినిపిస్తున్నావు
కనుక దయచేసి ఆ సెల్ ఫోను పక్కన బెడతావా?
ఈ రోజు ఎంత హాయిగా ఉందో ఇంకా గుర్తించలేదా?
ఆ కుర్రాడిని చూసి నీకూ గెంతాలనీ, పరిగెత్తాలనీ అనిపించటం లేదూ?
నువ్వు జాగింగు చేస్తూ కూడా సెల్ ఫోను వదలవేం?
వదలవూ? ఎందుకంటే, ఇప్పుడే మీ బాస్ కి
నువ్వు కొత్తగా ఇవ్వడం ప్రారంభించిన అమ్మకపు ప్రణాళిక
దెబ్బకి పోటీదారులు ఖంగుతిని వాళ్ళు కుదేలైపోతారనా?
మూర్ఖుడా! అటుచూడు నువ్వు ఓ సన్యాసినిని గుద్దేస్తున్నావు
ఇకనైనా ఆ సెల్ ఫోనుని పక్కనబెడతావా?
చివరి హెచ్చరిక
మిత్రమా! నేను ఇదేదో సరదాకి చెప్పడం లేదు.
నడుపుతున్నపుడు రోడ్డుమీద ప్రజల నడవడి
ఊరిలోకి వచ్చేసరికి ఆవేశం తెప్పిస్తోంది.
నామీద “Prozac”ప్రభావంలేదుగానీ, చేతిలో తుపాకీ ఉంది.
కనుక దయచేసి ఇకనైనా నీ సెల్ ఫోను ప్రక్కనబెడతావా?
.
గెయిల్ వైట్
జననం 1945
అమెరికను కవయిత్రి.

స్పందించండి