బేరసారాలు … డెబోరా వారెన్, అమెరికను కవయిత్రి

నాకు ఒక ధనికుడి కథ తెలుసును:
గాయాలనుండో, ప్లేగునుండో, అమ్మవారో, లేక కుష్టువ్యాధో…
ఏదో రోగంతో మంచం పట్టో, మృత్యుముఖంలోకి వెళ్లినపుడో
అతనొక ప్రమాణం చేసుకున్నాడు: భగవంతుడే గనక తన మొర
ఆలకించి తిరిగి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే, అతను
అతని కృతజ్ఞతను ప్రకటించడానికి బ్రహ్మాండమైన
శిలలతో ఒక అద్భుతమైన చర్చి కట్టిస్తానని.
నా సంగతీ అంతే. నేనుకూడా దేముడితో నాకునచ్చినట్టు
బేరసారాలు కొనసాగిస్తాను (అయితే, ఇక్కడ దేముడంటే
నా ఉద్దేశ్యం నేనే). ఇలా అనుకుంటుంటాను:
“ఓ భగవంతుడా! ఈ బయాప్సీ నెగెటివ్ వచ్చేలా చూడు! ఇకమీదట
నా నడవడి మార్చుకుంటాను; దయగలిగి, నిస్వార్థంగా, మంచిగా ఉంటాను.”
నా ప్రమాణాన్ని దానితో సరిపోల్చి చూడండి. ఇప్పటికీ ఆ చర్చి శిఖరం
చెక్కుచెదరకుండా ఉంది కన్నెత్తి చూసేలా; నే నిచ్చేదేముంది? దానికి ఏ విలువా లేదు.
అందులోనూ మృత్యువుని వాయిదా వేసినందుకు ప్రతిఫలంగా?
కాని ఎన్నాళ్ళు నేను నా మాటమీద నిలబడతాననుకున్నారు?
.

డెబోరా వారెన్

జననం 1946

అమెరికను కవయిత్రి.

.

.

A Bargain

.

I know the story of a rich man, cured

Of wounds, or plague, or pox, or leprosy—

Whatever—sick or dying, anyway,

Who’d made a vow:  If the Almighty heard

His prayer and made him whole again, then he

Would build a great cathedral to display

His gratitude in lofty gothic stone.

That’s how it is with me.  I make my own

Bargains with God (of course it’s understood

By God I mean myself).  “God,” I might vow,

“Just let the biopsy be negative—

I’ll mend my ways; be kind, unselfish, good.”

Compare my pledge to his, that even now

Lifts its spire:  Cheaper, what I’d give—

a good deal, for a thing like death deferred.

But how long do you think I keep my word?

.

Deborah Warren

(Born 1946 Boston)

American Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Bargain.htm .

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: