మంచు పలకలు … H W లాంగ్ ఫెలో, అమెరికను
మోడువారి, నగ్నంగా ఉన్న అటవీ సీమల మీంచి
కోతల తర్వాత ఉపేక్షించబడిన పంటభూములమీంచి
గాలి గుండె లోతుల్లోంచి,
దాని మొయిలు ఉడుపుల కదలికలలలోంచి,
నిశ్శబ్దంగా, నెమ్మదిగా, మెత్తగా
మంచు జాలువారుతోంది.
చిత్రమైన ఆకారాలు ధరించే ఈ మేఘాలు
అకస్మాత్తుగా దివ్యాకృతుల్లో కనిపించినా,
పాలిపోయిన వదనంతో కలతచెందిన మనసు
తన తప్పిదాలను ఒప్పుకుని మన్నించమని వేడుకుంటుంటే
ఉద్విగ్నమైన ఆకాశ శకలం
తన మనసులోని బాధను వ్యక్తం చేస్తుంది.
ఈ కవిత గాలి అంతరంగ వ్యధ
మౌనంగా సడిలేని శబ్దవర్ణాలతో లిఖించబడింది;
మేఘాలగుండె లోతుల్లో చిరకాలంనుండీ
పదిలంగా దాచుకున్న నిరాశా రహస్యం;
ఇన్నాళ్లకి అది వనభూములకీ, మైదానాలకీ
గుసగుసలువోతూ చెప్పుకొస్తోంది.
.
H W లాంగ్ ఫెలో
(February 27, 1807 – March 24, 1882)
అమెరికను.
.
Snow-flakes
.
Out of the bosom of the air,
Out of the cloud-folds of her garments shaken,
Over the woodlands brown and bare,
Over the harvest-fields forsaken,
Silent, and soft, and slow
Descends the snow.
Even as our cloudy fancies take
Suddenly shape in some divine expression,
Even as the troubled heart doth make
In the white countenance confession,
The troubled sky reveals
The grief it feels.
This is the poem of the air,
Slowly in silent syllables recorded;
This is the secret of despair,
Long in its cloudy bosom hoarded,
Now whispered and revealed
To wood and field.
.
Henry Wadsworth Longfellow
(February 27, 1807 – March 24, 1882)
American Poet
Poem Courtesy:
http://www.poemtree.com/poems/Snow-flakes.htm
నానావర్ణ సౌందర్యం… గెరార్డ్ మేన్లీ హాప్కిన్స్, ఇంగ్లీషు కవి
Trout
Brinded Cow
Finch
ఇన్ని వన్నెచిన్నెలుగల ప్రకృతిని సృష్టించిన దైవానికి నుతులు.
పొడల ఆవులా జంట రంగుల్లో కనిపించే ఆకాశమూ;
విలాసంగా ఈదే చుక్కలచుక్కల జల్లచేపకి పక్కలో గులాబిరంగు మెరుపులూ;
అప్పుడేవెలిగించిన బొగ్గులా చెట్లనుండి రాలిన బాదంలూ; ఫించ్ పక్షుల బారజాచిన రెక్కలూ;
పంటపొలాలతో, చవిటినేలలతో, రకరకాలచెట్లతో కనుచూపుమేరా అలంకరించే ప్రకృతిదృశ్యాలూ
అన్ని రకాల వృత్తులూ, వాటి పరికరాలూ, పనిముట్లూ వగైరా వగైరా. ఓహ్! ఏం చెప్పను!
అందులో మళ్ళీ సహజమైనవీ, అనుకరణలూ, చిత్రమైనవీ, అరుదైనవీ,
చంచలమైనవన్నీ వింత వింత వన్నెల్లో (అవెందుకలా ఉన్నాయో ఎవరు చెప్పగలరు?)
వడియైనవీ, నెమ్మదియైనవీ, తియ్యనివీ, పుల్లనివీ, మెరిసేవీ, అస్పష్టమైనవీ ;
ఇన్నింటి సౌందర్యం మార్పుకి అతీతంగా తీర్చిదిద్దిన ప్రభువు అతను.
అతనికి జేజేలు పలకండి.
.
గెరార్డ్ మాన్లీ హాప్కిన్స్
(28 July 1844 – 8 June 1889)
ఇంగ్లీషు కవి
.
.
Pied Beauty
.
Glory be to God for dappled things
For skies of couple-colour as a brinded cow;
For rose-moles all in stipple upon trout that swim;
Fresh-fire coal chestnut-falls; finches’ wings;
Landscapes plotted and pieced—fold, fallow, and plough;
And all trades, their gear and tackle and trim.
All things counter, original, spare, strange;
Whatever is fickle, freckled (who knows how?)
With swift, slow; sweet, sour; adazzle, dim;
He fathers-forth whose beauty is past change:
Praise Him.
.
Gerard Manley Hopkins
(28 July 1844 – 8 June 1889)
English Poet
Poem Courtesy:
http://www.poemtree.com/poems/PiedBeauty.htm
ప్రేమ… జార్జి హెర్బర్ట్, వెల్ష్ కవి
ప్రేమ నాకు స్వాగతం పలికింది, కానీ నా మనసు
వెనక్కి లాగింది నా మురికినీ, చేసిన పాపాలనీ తలుచుకుని.
కానీ చురుకు చూపులుగల ప్రేమ నేను లోపలికి
అడుగుపెట్టిన తర్వాత నేను వెనుకాడడం ఇట్టే గ్రహించి
నన్ను తనకి దగ్గరగా తీసుకుంది, మధురమైన
స్వరంతో నాకేమిటి కావాలో అడిగింది.
“ఇక్కడికి రా దగిన అతిథులెలా ఉంటారో చూద్దామని,” అన్నాను
ప్రేమ, “వేరెవరో ఎందుకు నువ్వే ఆ అతిథివి,” అంది.
“నేనా? నావంటి నిర్దయుడూ, కృతఘ్నుడూనా?
ప్రభూ! అది వింటే సిగ్గుతో తలెత్తుకోలేను,” అన్నాను.
ప్రేమ ఆప్యాయంగా నా చెయ్యి తన చేతిలోకి తీసుకుని,
“మంచీ చెడూ చూసే కనులిచ్చింది ఎవరు? నేను కాదూ?” అంది.
“నిజమే ప్రభూ! కాని వాటిని నే నెన్నడో పోగొట్టుకున్నాను;
నా అకృత్యాలకు అర్హమైన చోటుకి నన్ను పోనీ.”
“నీకు తెలియదూ నేరాలన్నీ ఎవరు తలకెత్తుకున్నారో?” అంది.
“అయితే, స్వామీ! నన్ను నీ సేవ చేయనీ.”
“నువ్వు కూచోవలసిందే, నా ఆతిథ్యం స్వీకరించవలసిందే,” అంది.
ఇక తప్పక నేను కూచుని ప్రేమ ఆతిథ్యం స్వీకరించాను.
.
జార్జి హెర్బర్ట్
(3 April 1593 – 1 March 1633)
వెల్ష్ కవి .
.
Love bade me welcome, yet my soul drew back,
Guilty of dust and sin.
But quick-ey’d Love, observing me grow slack
From my first entrance in,
Drew nearer to me, sweetly questioning
If I lack’d anything.
“A guest,” I answer’d, “worthy to be here”;
Love said, “You shall be he.”
“I, the unkind, the ungrateful? ah my dear,
I cannot look on thee.”
Love took my hand and smiling did reply,
“Who made the eyes but I?”
“Truth, Lord, but I have marr’d them; let my shame
Go where it doth deserve.”
“And know you not,” says Love, “who bore the blame?”
“My dear, then I will serve.”
“You must sit down,” says Love, “and taste my meat.”
So I did sit and eat.
.
George Herbert
(3 April 1593 – 1 March 1633)
Welsh Poet
Poem Courtesy:
http://www.poemtree.com/poems/LoveIII.htm
ప్రార్థన … లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి
ప్రభూ! ఈ బ్రతుకు జీవచ్ఛవం లాంటిదైనప్పటికీ
మేమేమి చేస్తున్నామో మాకు అవగాహనలేకపోయినప్పటికీ
మేము పురిలేని సన్నని దారంవంటి నమ్మకాలతో బ్రతుకుతున్నప్పటికీ
పోరాడి ఓడిపోవడానికి కావలసిన ధైర్యాన్ని ప్రసాదించు.
ఎప్పుడైనా తిరగబడగలిగితే నన్ను తిరగబడనీ
నన్ను భక్తుడికంటే సాహసికుడిని చెయ్యి
నన్ను అన్నిటికీ అతి సులభంగా సంతృప్తిపడేలా చెయ్యకు
నన్ను ఎప్పుడూ సందేహాలతో తేలియాడేలా అనుగ్రహించు.
దృశ్యాలచుట్టూ పరివేష్టితమైన అందాన్నీ
ఆశ్చర్యకరమైన విషయాలనీ చూడగలిగే కన్నులివ్వు
కానీ అన్ని వేళలా పంకిలాలనీ
అందులోనే పుట్టి నశించేవాటినీ చూడగలిగేట్టు చెయ్యి.
నా చెవులు సంగీతాన్ని ఆస్వాదించగలిగేట్టు అనుగ్రహించు
వాసంతపు తొలి మురళీరవాలకీ, మృదంగాలకీ పులకరించనీ
కానీ ఎన్నడూ మురికివాడలలో మ్రోగే
విషాదగీతాలను మరిచిపోయే సాహసం చెయ్యనీకు.
పనులు సగంచెయ్యడానికీ, రాజీపడిపోడానికీ
దూరంగా ఉండే అహంభావిగా, మొండివాడిగా నన్ను ఉంచు
కడకు విజయం నన్ను వరించినప్పటికీ,
ప్రభూ! నాలో ఇంకా కొంత అసంతృప్తి మిగుల్చు.
.
లూయీ అంటర్ మేయర్
(October 1, 1885 – December 18, 1977)
అమెరికను కవి .
.
Prayer
.
God, though this life is but a wraith,
Although we know not what we use,
Although we grope with little faith,
Give me the heart to fight—and lose.
Ever insurgent let me be,
Make me more daring than devout;
From sleek contentment keep me free,
And fill me with a buoyant doubt.
Open my eyes to visions girt
With beauty, and with wonder lit—
But always let me see the dirt,
And all that spawn and die in it.
Open my ears to music; let
Me thrill with Spring’s first flutes and drums—
But never let me dare forget
The bitter ballads of the slums.
From compromise and things half done,
Keep me with stern and stubborn pride;
And when at last the fight is won,
God, keep me still unsatisfied.
.
Louis Untermeyer
(October 1, 1885 – December 18, 1977)
American Poet
Poem Courtesy:
http://www.bartleby.com/104/107.html
జమీందారు తోట … ఎడ్వర్డ్ థామస్, ఇంగ్లీషు కవి
రాయిలాంటి మట్టికూడా కొద్దిగా మెత్తబడింది,
రెండుప్రక్కలా ప్రవహిస్తున్న పిల్లకాలువలతో
కంచెల్లో కదలాడుతున్న పూలతో రోడ్డు తళతళలాడుతోంది.
ఎండకాస్తున్నప్పటికీ నేల తనమానాన తాను నిద్ర తీస్తోంది.
ఏనాటిదో ఈ జమీందారు తోటనీ, చర్చినీ, దానికి ఎదురుగా
వయసులో, ఎత్తులో సమానంగా ఉన్న యూ-చెట్టునీ చూసేదాకా
వాలుగా పడుతున్న కిరణాల్ని మామూలుగా అయితే లెక్కపెట్టేవాడిని కాదు
అవి ఫిబ్రవరి నెల సౌందర్యంలో ఒక భాగంగా అనుకుని ఉండే వాడిని.
ఆ చర్చీ, ఆ యూ-చెట్టూ, జమీందారు తోటా ఆదివారం
మధ్యాహ్నపు నిశ్శబ్దానికి నిద్రలో జోగుతూ జోగుతూ ఉన్నాయి.
ఎక్కడా గడ్డిపరకైనా కదులుతున్న గాలి జాడలేదు.
బాగా ఏటవాలుగా ఉన్న తోటబంగళా కప్పుమీద పెంకులు
మధ్యాహ్నపు ఎండవేడికి లీలగా మెరుస్తున్నాయి; దానిమీద క్రిందకీ
మీదకీ పావురాలు ఎగురుతూ వెచ్చగా కుదురుకుంటున్నాయి.
ఒక్క చిన్న శబ్దం మినహా మరే చప్పుడూ వినిపించడం లేదు.
బగ్గీకి కట్టే 3 గుర్రాలు వాటిని హింసిస్తున్న ఒకే ఒక్క ఈగను
తోకతో చెదరగొడుతూ, వాటి ముంగురుల సందులోంచి
అర్థనిమీలిత నేత్రాలతో ద్వారం వంక చూస్తున్నాయి.
శీతకాలం వసంత, గ్రీష్మ, శిశిరాది ఋతువుల్ని ఒక్క గుటకలో
త్రాగేసిందా అన్నట్టు దాని బుగ్గలు మెరుస్తూ ప్రశాంతంగా
నవ్వుతున్నట్టుంది. కానీ నిజానికి అది హేమంతానికే పరిమితమైన దృశ్యంకాదు…
అదొక మార్పుకు ఎరగాని బ్రహ్మానంద ఋతుస్థితి.
ఎంతో పురాతనమై, సంతోషానికి మారుపేరుగా పిలవబడే
ఈ ఇంగ్లండు నేలమిద ఆ తోటల్లో, చర్చిలో యుగయుగాలుగా
వాటి పెంకుల కప్పులక్రిందా,గడ్డికప్పులక్రిందా
భద్రంగా నిక్షిప్తమై ఉండి, ఇపుడు మళ్ళీ మేలుకొంది.
.
ఎడ్వర్ద్ థామస్
(3 March 1878 – 9 April 1917)
ఇంగ్లీషు కవి

(3 March 1878 – 9 April 1917)
.
The Manor Farm
The rock-like mud unfroze a little and rills
Ran and sparkled down each side of the road
Under the catkins wagging in the hedge.
But earth would have her sleep out, spite of the sun;
Nor did I value that thin gliding beam
More than a pretty February thing
Till I came down to the old Manor Farm,
And church and yew-tree opposite, in age
Its equals and in size. The church and yew
And farmhouse slept slept in a Sunday silentness.
The air raised not a straw. The steep farm roof,
With tiles duskily glowing, entertained
The mid-day sun; and up and down the roof
White pigeons nestled. There was no sound but one.
Three cart-horses were looking over a gate
Drowsily through their forelocks, swishing their tails
Against a fly, a solitary fly.
The Winter’s cheek flushed as if he had drained
Spring, Summer, and Autumn at a draught
And smiled quietly. But ’twas not Winter—
Rather a season of bliss unchangeable
Awakened from farm and church where it had lain
Safe under tile and thatch for ages since
This England, Old already, was called Merry.
Edward Thomas
(3 March 1878 – 9 April 1917)
English Poet
Poem Courtesy:
http://www.poemtree.com/poems/ManorFarm.htm
కర్తవ్యం… సారా టీజ్డేల్, అమెరికను కయిత్రి
వెర్రివాడా! పనికిమాలిన చేతులతో
గాలిని చెదరగొట్టడానికి ప్రయత్నించకు—
జరగవలసిన పొరపాటు జరిగిపోయింది; బీజం పడింది.
చేసిన నేరం స్థిరమైపోయింది.
ఇప్పుడు నీ కర్తవ్యం
చేసిన పొరపాట్ల వలలోనుండి
చేసిన దుష్కార్యాల అల్లికలోనుండి
ఒక రాగాన్ని సృష్టించగలవేమో చూడడం.
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి
.
Duty
Fool, do not beat the air
With miserable hands—
The wrong is done, the seed is sown,
The evil stands.
Your duty is to draw
Out of the web of wrong,
Out of ill-woven deeds,
A thread of song.
Sara Teasdale
(August 8, 1884 – January 29, 1933)
American
Poem Courtesy: http://www.poemtree.com/poems/Duty.htm
అనైతికం … ఎజ్రా పౌండ్, అమెరికను కవి
మనం ప్రేమకోసం, తీరుబడికోసం అర్థిస్తాం
మిగతావి ఏవీ అర్రులుజాచేంత గొప్పవి కావు
నేను చాలా దేశాలు తిరిగినా
జీవితంలో ప్రత్యేకత ఏదీ కనిపించలేదు.
గులాబిరేకలు వాడికృశిస్తేనేం
నేను నా ఇష్టమైనది ఆరగిస్తాను
హంగేరీలో ఘనకార్యాలు చేసేకంటే
అందరి నమ్మకాలూ దాటి ముందుకెళతాను.
.
ఎజ్రా పౌండ్
(30 October 1885 – 1 November 1972)
అమెరికను కవి.

.
An Immorality
.
Sing we for love and idleness,
Naught else is worth the having.
Though I have been in many a land,
There is naught else in living.
And I would rather have my sweet,
Though rose-leaves die of grieving,
Than do high deeds in Hungary *
To pass all men’s believing.
Ezra Pound
(30 October 1885 – 1 November 1972)
American Poet
Notes for students:
* high deeds in Hungary = I believe this refers to heroic deeds in Hungary
during World War I
Poem Courtesy:
http://www.poemtree.com/poems/Immortality.htm
యువకుడూ- ఆయుధాలూ…. విల్ఫ్రెడ్ ఓవెన్, ఇంగ్లీషు కవి
ఆ కుర్రాడిని తుపాకి బాయ్ నెట్ కత్తిని అలా చేత్తో రాస్తూ
అది ఎంత చల్లగా ఉందో, ఎంత రాక్తదాహంతో పదునుగా ఉందో
వెర్రివాడి చేతిలో రాయిలా, అసూయతో పచ్చబారిందో,
మాంసానికి అలమటిస్తూ సన్నగా తీర్చబడిందో తెలుసుకోనీండి.
యువకుల గుండెల్లో ఒదగాలని తపించే, మొండి, విచక్షణ
ఎరుగని సీసపుగుళ్ళని ఇచ్చి లాలనగా నిమరనీండి
లేదా వాళ్ళకి పదునైన జింకు గుళ్ళని సరఫరా చెయ్యండి
అవి దుఃఖమూ, మృత్యువంత పదునుగా ఉండాలి.
అతని దంతాలు ఆపిలుపండు కొరుకుతూ ఆనందంగా ఉండదగ్గవి
అతని సున్నితమైన చేతివేళ్ల వెనుక ఏ పక్షిగోళ్ళూ లేవు
అతని కాలివేళ్లకి దైవము ఏ పదునైన డేగగోళ్ళూ మొలిపించదు
అతని దట్టమైన ఉంగరాలజుట్టులోంచి ఏ కొమ్ములూ మొలవవు.
.
విల్ఫ్రెడ్ ఓవెన్
(18 March 1893 – 4 November 1918)
ఇంగ్లీషు కవి
.
.
Arms and the Boy
Let the boy try along this bayonet-blade
How cold steel is, and keen with hunger of blood;
Blue with all malice, like a madman’s flash;
And thinly drawn with famishing for flesh.
Lend him to stroke these blind, blunt bullet-leads
Which long to nuzzle in the hearts of lads,
Or give him cartridges of fine zinc teeth,
Sharp with the sharpness of grief and death.
For his teeth seem for laughing round an apple.
There lurk no claws behind his fingers supple;
And God will grow no talons at his heels,
Nor antlers through the thickness of his curls.
Wilfred Owen
(18 March 1893 – 4 November 1918)
English Poet
Poem Courtesy:
http://www.poemtree.com/poems/ArmsAndTheBoy.htm
ప్రియతమా!ఇప్పుడు నిన్ను మరిచిపోగలను… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే అమెరికను కవయిత్రి
ప్రియతమా! నిన్నిపుడు మరిచిపోగలను.
కనుక ఆ మిగిలిన ఒక్క రోజూ, నెలా, సంవత్సరమూ
నేను మరణించేలోగా, మరిచిపోయేలోగా, ఎడబాటయేలోగా
ఉన్న సమయాన్ని ఎంతవీలయితే అంతబాగా గడుపు.
దానితో సరి. ఆపై శాశ్వతంగా ఒకరిఊసు ఒకరికి ఉండదు.
ముందే అన్నట్టు నిన్ను క్రమంగా మరిచిపోతాను. కానీ ఇప్పుడు
నువ్వు నీ అందమైన అబద్ధంతో బ్రతిమాలబోతే
నా అలవాటైన ఒట్టుతో ప్రతిఘటిస్తాను.
నిజానికి ప్రేమ చిరకాలం కొనసాగితే బాగుణ్ణని నాకూ ఉంది
ఒట్లుకూడా అంతబలహీనంగా ఉండకపోతే బాగుణ్ణనీ ఉంది
కానీ అవి అంతే, ప్రకృతి వాటిని అలా ఉండమని నిర్దేశించి
ఇప్పటి వరకూ విఘ్నంలేకుండ వాటి ప్రయాస కొనసాగిస్తోంది.
మనం వెతుకుతున్నది మనకి లభించినా, లభించకున్నా
జీవశాస్త్ర పరిభాషలో చెప్పాలంటే… అది జడపదార్థమే.
.
ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే
(February 22, 1892 – October 19, 1950)
అమెరికను కవయిత్రి
.
.
I Shall Forget You Presently, My Dear
.
I shall forget you presently, my dear,
So make the most of this, your little day,
Your little month, your little half a year,
Ere I forget, or die, or move away,
And we are done forever; by and by
I shall forget you, as I said, but now,
If you entreat me with your loveliest lie
I will protest you with my favorite vow.
I would indeed that love were longer-lived,
And oaths were not so brittle as they are,
But so it is, and nature has contrived
To struggle on without a break thus far,—
Whether or not we find what we are seeking
Is idle, biologically speaking.
Edna St. Vincent Millay
(February 22, 1892 – October 19, 1950)
American Poet
Poem Courtesy:
http://www.poemtree.com/poems/IShallForgetYouPresently.htm
మినర్వా జోన్స్… ఎడ్గార్ లీ మాస్టర్స్, అమెరికను కవి
1915 లో Spoon River Anthology అన్న పేరుతో Edgar Lee Masters సంకలనం ప్రచురించి ఒక అద్భుతమైన ప్రయోగం చేశాడు. ఆయన స్వంత ఊరుకి దగ్గరగా ప్రవహిస్తున్న Spoon River పేరుతో ఒక నగరాన్ని కల్పనచేసి, ఆ నగర ప్రజలలో 212 మంది మృతులు తమ జీవితాలగురించి తామే చెబుతున్నట్టుగా 244 సంఘటనలను ప్రస్తావిస్తూ కవితలు వ్రాసాడు. అమెరికను నగరాల గురించి, పల్లెల గురించి ప్రజలలో ఉన్న కొన్ని భ్రమలని తొలగింపజెయ్యడమే ఈ సంకలనం ముఖ్యోద్దేశం.
***
నా పేరు మినర్వా, నేనొక జానపద కవయిత్రిని
వీధిలో అల్లరిచిల్లరగా తిరిగే పోకిరీవాళ్ళు
నా భారీశరీరానికీ, మెల్ల కళ్ళకి, కాళ్ళీడ్చి నడవడానికీ
నన్ను వెక్కిరించేవాళ్ళు. అన్నిటికీ మించి ఆ దుర్మార్గుడు
వెల్డీ నన్ను దారుణంగా వెంబడించి మరీ చెరిచాడు.
డాక్టర్ మేయర్స్ దగ్గర నా ఖర్మకి నన్ను విడిచిపెట్టాడు.
పాదాలదగ్గరనుండి పై వరకూ స్పర్శకోల్ఫోతూ క్రమక్రమంగా
మంచులోకి కూరుకుపోతున్నట్టూ, మృత్యుకుహరంలోకి ప్రవేశిస్తున్నట్టూ ఉంది.
దయచేసి ఎవరైనా ఈ పల్లెలోని పాత వార్తాపత్రికలు సంపాదించి
అందులో నేను వ్రాసిన కవితల్ని కవితల్ని సంకలించరూ?
నేను ప్రేమ కోసం అంతగా ప్రాకులాడేను!
నేను జీవితంకోసం అంతగానూ తపించేను!
.
ఎడ్గార్ లీ మాస్టర్స్
(August 23, 1868 – March 5, 1950)
అమెరికను కవి
.
.
Minerva Jones
.
I am Minerva, the village poetess,
Hooted at, jeered at by the Yahoos of the street
For my heavy body, cock-eye, and rolling walk,
And all the more when “Butch” Weldy
Captured me after a brutal hunt.
He left me to my fate with Doctor Meyers;
And I sank into death, growing numb from the feet up,
Like one stepping deeper and deeper into a stream of ice.
Will some one go to the village newspaper,
And gather into a book the verses I wrote?—
I thirsted so for love!
I hungered so for life!
Edgar Lee Masters
(August 23, 1868 – March 5, 1950)
American Poet