ఏలిస్ స్మృతిలో… కేథరీన్ టఫెరీలో, అమెరికను కవయిత్రి

ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట నువ్వున్నావని ఎప్పుడూ అనుకుంటుంటాను;
ఎప్పుడో ఒకరోజు మళ్ళీ మనిద్దరం తప్పకుండా కలుసుకుంటామనీ
ఎన్నో ఏళ్ళు గడిచిపోయిన తర్వాత హాయిగా తిరిగివచ్చిన హీరోల్లా,
మనిద్దరం మన సాహసగాథలు కలబోసుకుంటామనీ భావించేదాన్ని.

మనిద్దరం కలిసి కుస్తీపట్లు పడుతూ “ఈలియడ్” చదివి
అప్పుడే 12 ఏళ్లు గడిచిపోయాయంటే నమ్మశక్యం కాకుంది,
అది ట్రోజన్ యుద్ధం జరిగిన సమయంకంటే ఎక్కువ,
ఆ తర్వాత ఒడిస్సస్ చేసిన సాహసయాత్రలకన్నా తక్కువ.

మీ అమ్మగారు నువ్వు లేవని చెప్పిన తర్వాత
నాకు ముందుగుర్తొచ్చింది నువ్వు ఎప్పుడూ వాడే మాట
9X88T …  విచారానికి మన సంకేత పదం…
ఓ పని చేద్దామనుకోవడం, పూర్తిచెయ్యకుండా ఆగిపోవడానికి.

“నేను నిన్న రాత్రి గ్రీకు చదువుదా మనుకున్నాను,” అని నువ్వనేదానివి,
సమాధానంగా నే ననేదాన్ని, “అవును, నేనుకూడా అగతా,
ఎలాగైనా సూర్యుడి లేలేత ఎరుపు కిరణాలు ప్రసరించే లోపు
నా పనులు నేను ఎలాగైనా పూర్తిచెయ్యాలనుకుంటున్నాను,” అని.

నువ్వు విడిచి వెళ్ళి అప్పుడే 7 ఏళ్ళు గడిచిపోయాయి.
నేను మాత్రం నిస్సారమైన జీవితాన్ని ఈడుస్తున్నాను.
అశ్రద్ధగా, నీ జ్ఞాపకాల్లో నిన్నూహించుకుంటూ
(మధ్యలో ఎన్నోచోట్లు మారడంలో, మెక్సికోనుండి

నువ్వు ఎంతో సరదాగా రాసిన ఉత్తరాల్ని పోగొట్టుకున్నాను.)
నీకుకూడా వయసు పైబడుతుందని ఎన్నడూ అనుకోలేదు.
శోకంలో మునిగి ఏడుస్తున్న హెకాబే కుమార్తెలకు మల్లే
నీకు కూడా కాలం అకస్మాత్తుగా ఆగిపోయింది.

1983 శరత్తులో, నీకు “ప్రయం కొడుకుల కేటలోగ్” ని
అనువాదం చెయ్యడం నీకు అభ్యాసంగా ఇచ్చినపుడు
మంటల్లో చిక్కుకున్న ట్రోయ్… నుండి అజ్ఞాత వీరుల
సమాధి మృత్తికలనుండి నువ్వు వారిని ఆహ్వానించేవు!

నిద్రపోతున్న నీ ముఖం మీద నుండి నేను ఎంత సుకుమారంగా
ఎండుటాకులు పకక్కి తొలగించి నిన్ను పేరుపెట్టి పిలిచినా
నువ్వు తిరిగిరావనీ, మరో ప్రపంచంలో నీ సాహస
కృత్యాలు నాతో పంచుకోవన్న సత్యం నమ్మశక్యంగా లేదు.
.

కేథరీన్ టఫెరీలో

జననం 1963

అమెరికను కవయిత్రి.

Catherine Tufariello Image Courtesy:
http://www.ablemuse.com

.

Elegy for Alice

I always assumed you were somewhere in the world,

And that someday we’d find each other again

And tell our adventures, like happy heroes

Reunited after years of wandering.

Hard to believe it’s been a dozen years

Since we slogged together through the Iliad,

Longer than the whole of the Trojan War,

Or the wanderings of Odysseus afterward.

When your mother told me you were dead,

All I could think about was our favorite verb,

9X88T, our rueful shorthand for regret,

To be about to do, but leave undone.

“I meant,” you’d say, “to study Greek last night,”

And I’d reply, “I too, O Agathon,

Intended to accomplish many things

Before the light of rosy-fingered dawn.”

And now it’s seven years that you’ve been gone.

While I was living my ordinary life,

And carelessly, fondly imagining you in yours,

(Losing, in one of my many moves, the funny,

Wonderful letters you wrote me from Mexico),

I never dreamed that you would not grow old,

That time had stopped for you as suddenly

As for the daughters of weeping Hekabe

In burning Troy—the unremembered ones

You summoned from the ashes in the fall

Of 1983, when you were asked

To translate the catalogue of Priam’s sons.

Hard to believe that you will not return

And tell your adventures in the other world,

No matter how tenderly I brush the dead

Leaves from your sleeping face, and call your name.

 .

Catherine Tufariello

Born 1963

American

Poem Courtesy:

http://www.poemtree.com/poems/ElegyForAlice.htm

 

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: