విను! హడావుడిగా వేసిన రోడ్డుమీద
పాంకోళ్ల టకటక ఇంకా వినిపిస్తూనే ఉంది.
ఒక చాకలి స్త్రీ శ్రమ మరవడానికి పదం పాడుకుంటోంది
ఇద్దరు అల్లరి పిల్లలు జాక్స్ ఆట ఆడుతూ
తగువులాడుకుంటున్నారు. కనిపించని ఘంట ఎక్కడో
ఆగష్టులోని ఓ రోజుముగిసిందనడానికి సూచికగా మోగుతోంది.
అయినా, అన్నీ ఉన్నచోటే ఉన్నాయి. ఈ కిటికీతలుపులు ఎన్నడూ కొట్టుకోవు
ఈ పిల్లలెప్పుడూ ఇంటిముంగిట తెలుపునలుపు గీతలు దాటిపోరు.
మేఘాలు పోతూపోతూ ఒక చినుకు రాల్చడమో, లేదా అస్తమసూర్యుడి
వెలుగులకి వాటి బుగ్గలు ఎరుపెక్కడమో జరుగుతోంది.
ఏ సరంగూ పాట అందుకోవడం లేదు; ఏ గాలి మరా తూములోకి
నీళ్ళు ఒంపడం లేదు. ఎక్కడో అనంతదూరాన యుద్ధభూమిలో
చిత్రకారుడి కుంచె దిగువ నిశ్శబ్దంలా తాత్కాలిక విరామం ప్రకటించబడింది.
.
ఏలన్ సల్లివాన్
(1948- July 9, 2010)
అమెరికను కవి .