తమార్ కి ఓదార్పు… ఎలీషియా స్టాలింగ్స్, అమెరికను కవయి

(ఒక పురాతనమైన మట్టిపాత్రని పగులగొట్టినందుకు)

.

తమార్! నేనేమీ పురావస్తుశాస్త్రజ్ఞుడిని కాదు

నాకు ఆ మట్టయినా, ఈ మట్టయినా ఒక్కటే.

కానీ, ఇన్ని వేల సంవత్సరాలు భూకంపాలనీ, వరదల్నీ, యుద్ధాలనీ

తట్టుకుని నిలబడాలంటే, దాన్లో ఏదో గొప్పదనం ఉండాలి.

కానీ, చివరకి అది నీచేతిలో పగిలిపోయింది.

గురుత్వాకర్షణశక్తి వల్లో, లేదా నీ చేతిలో రాసిపెట్టి ఉండో…

నాకేమనిపిస్తుందంటే, అది ఇన్నాళ్ళూ ఆ భూమి పొరల్లో

ఇన్ని యుగాలుగా నిరీక్షించి ఉండకపోతే,

నీ వేలికొసల సంగీతానికి, బహుశా నీ నులిరక్తవేడిస్పర్శకి

దానికి ఎక్కడినుండో ధైర్యం వచ్చి తను గులాబి మొగ్గను కాననీ,

కేవలం మట్టికుండనన్న విషయం మరిచి

నీకోసం వికసించబోయే ప్రయత్నంలో, భళ్ళున పగిలిపోయింది.

.

ఎలీషియా స్టాలింగ్స్

జననం జులై 2, 1969

అమెరికను కవయిత్రి .

.

Consolation for Tamar

.

(On the occasion of her breaking an ancient pot)

You know I am no archeologist, Tamar,

And that to me it is all one dust or another.

Still, it must mean something to survive the weather

Of the Ages—earthquake, flood, and war—

Only to shatter in your very hands.

Perhaps it was gravity, or maybe fated—

Although I wonder if it had not waited

Those years in drawers, aeons in distant lands,

And in your fingers’ music, just a little

Was emboldened by your blood, and so forgot

That it was not a rosebud, but a pot,

And, trying to unfold for you, was brittle.

.

Alicia E. Stallings

Born July 2, 1968

American Poetess and Translator 

Poem Courtesy:

http://www.poemtree.com/poems/ConsolationForTamar.htm

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: