ఆ జంత్రవాద్యం
స్పష్టమైన ధ్వని తరంగాలు
విడిచిపెడుతుంది
అవి త్వరగా లయమైపోతాయి.
అవి ఆశ్చర్యమగ్నమైన
మనసుని అకస్మాత్తుగా ముంచెత్తి
కనుమరుగయే
ప్రేమలాంటివి.
ఆ శబ్దానికి
స్వరమిచ్చే చేతులు
మరొక స్థాయిలో
తిరిగి ప్రాణం పోస్తే,
మనస్ఫూర్తిగా ఇష్టపడి
చేసుకున్న ఎంపిక
క్షణాలు గడుస్తున్నా
మారకుండా స్థిరంగా ఉంటుంది.
నేను నిన్న
నీకు నా ప్రేమ వ్యక్తపరిచినపుడు
మామూలుగా ఆ కథ అక్కడితో
అంతమైపోయి ఉండేది.
కానీ, నా ప్రేమకి
నువ్వు సమాధానం ఇచ్చి
నేను దాన్ని
మరిచిపోలేకుండా చేసేవు.
ప్రేమకి ప్రేమ
ఒకే స్థాయిలో ఇచ్చి పుచ్చుకోవడం
ఈ క్షణం సమసిపోతే
మరుక్షణం అందులోంచే పుడుతుంది.
ఇప్పుడు మనం
రాయబోయే అజ్ఞాత
ప్రేమగీతానికి
అంకితమైపోయాం.
.
జాన్ ష్రైబర్
జననం 1941
అమెరికను కవి, అనువాదకుడు, సాహిత్య విమర్శకుడు .
.
Acoustics
The harpsichord
releases sounds
of crystal line,
rapid decay.
They are like love
that fast surrounds
the astonished sense,
then falls away,
Unless the hands
that gave them voice
renew them in
another range,
So that the act
of willful choice
makes constancy
while moments change.
Thus when I loved you
yesterday,
that might have been
the end of it,
But you gave answer
to my play
and made sure I
would not forget.
Measure for measure,
love for love,
this instant’s born
where that one dies.
We are bound to
the learning of
the unknown song
we improvise.
.
Jan Schreiber
Born 1941
American Poet, Translator and Literary critic
Poem Courtesy:
http://www.poemtree.com/poems/Acoustics.htm
స్పందించండి