రోజు: జూలై 25, 2017
-
మనలో మన మాట… కెరొలీన్ రఫేల్, అమెరికను కవయిత్రి
ఎవరన్నారు ఈ పిల్లల్ని ఎగిరిపోనివ్వాలని? ఈ పిల్లలు మన పేగుతో ముడిపడినవాళ్ళు వాళ్లకి మన అవసరం ఉంటుంది, చివరకి ఎగిరిపోనివ్వడమేనా? (నేను ఈ మాటలు అనవలసి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు) ఋతువులన్నీ సంగీతంలోని స్వరాల్లా క్రమంతప్పకుండా వచ్చిపోయే ఈ ఇంటి చెట్టుకి దగ్గరలోనే … ఏ కొమ్మమీదో గూడుకట్టుకుంటే, ఏమిటిట నష్టం? ఈ-ఉత్తరాలనీ, పుట్టినరోజు కార్డులనీ, ఫోన్లనీ ఎప్పుడూ మనం రొట్టె తునకలే ఎందుకు ఏరుకోవాలి? తక్కినవాళ్లందరూ వాళ్ళపిల్లలతో హాయిగా ఉంటే మనమెందుకు ఇట్టే గడిచిపోయే శలవులతో…