ఎలాగైతేనేం చివరకి,ఆ జీర్ణమయిన శయ్యనుండి ధవళవస్త్రధారులు తనభర్త శవాన్ని బయటకి తీసుకుపోతుంటే, కళ్ళప్పగించి చూడటం తప్ప ఆమెకు ఏమీ చెయ్యడం చాతకాలేదు. ఆమె తనలో తాను, కర్మకాండ అంత ఆర్భాటంగా జరిగినపుడు తన స్నేహితులంత మంచివారెక్కడా ఉండరని అనుకుంది. కర్మకాండ జరుగుతున్నంత సేపూ చేష్టలుడిగి చూడటం తప్ప ఆమె వేరే ఏమీ చెయ్యలేకపోయింది.
ఏడాది పాటు అతనికై శోకించింది. భవిష్యత్తు గూర్చిన దిగులు తొలగిన తర్వాత, ఆమెకు తన సామర్థ్యం మీద దిగులు పట్టుకుంది. ఎలాగోలా పక్కమీంచి లేచిన ఆమెకిఉండడానికి చోటు లేదు తనకి యోగ్యమైనదీ, సరిపడినదీ ఇల్లు అద్దెకు తీసుకుంది భక్తిగా సేవచేసినందుకు ప్రతిఫలం ఏమీ ఇవ్వలేదు. ఆమె ఏమీ చెయ్యలేదు. అందుకే, తన కొడుకు వచ్చి ఏ డాక్టరుదగ్గరికో తీసుకెళ్ళీదాకా కూచుని పత్రికలో అడ్వర్టైజుమెంట్ల వైపు చూస్తూ కాలం గడుపుతుండేది.
అలా ఏళ్ళు గడిచిపోయాయి. పక్కమీంచి ఆసుపత్రికి, తిరిగి ఇంటికి. ఇలా వీటిచుట్టూ తిరగడమే తప్ప వెళ్ళడానికి ఏ చోటూ లేదు. జీవితం అంతమయ్యేదాకా ఒంటిమీదకి ఏదో బట్ట చాలు. అంతకుమించి అక్కరలేదు; ఆమె పనులు ఆమె చేసుకునేది. చివరకి ఆ చితికిన పక్కమీంచే అలా ఎటుచూస్తోందో తెలియని శూన్యంలోకి తేరిచూస్తోంది. .
స్పందించండి