ఉనికి వ్యక్తపరచని వ్యక్తి… ఏంథొనీ లొంబార్డీ అమెరికను కవి
ఎప్పుడూ మా నాన్న ఆయన పని ఆయన చేసుకుంటూ మౌనంగా ఉంటారు కాబట్టి తెలియని వ్యక్తి ఎవరైనా, ఆయన ఏ పని చెయ్యవలసి వచ్చినా ఏది చెప్పాలన్నా, చెయ్యాలన్నా సందర్భానికి ఆయన అక్కడ ఉండరు కాబట్టి వాటిని ఆయన పట్టించుకోరని అపోహపడే అవకాశం ఉంది. కానీ, నేను మాత్రం అలా అనుకోను. ఎందుకంటే, అతను తరచు ఊర్లు తిరుగుతున్నప్పటికీ, ఇంటికి వచ్చేక పెట్టె క్రిందపెట్టేటపుడు చిందరవందరగా కనిపించినప్పటికీ ఉబ్బెత్తుగా ఉన్న అతని జేబుల్లో ఉన్న మిఠాయిలు అతను దూరంగా ఉన్నా మా గురించి ఆలోచించేవారని చెప్పేవి. కనుక అతను నిజంగా ఎదుట లేకున్నా, చెప్పడానికి ఏమీ లేక అన్నీ వింటున్నా, నేను తలెత్తి చూస్తే నాకు అన్నిదిక్కులా ఆయనే కనిపించే వారు… నిర్మలమైన, స్థిరమైన పురోహితుడు లేదా సన్యాసిని మనసుకి భగవంతుడి ఉనికి, అతను కనిపించకున్నా ఎలా తెలుసో, అలా. . ఏంథొనీ లొంబార్డీ
స్పందించండి