ప్రార్థన… హెన్రీ డేవిడ్ థరో, అమెరికను కవి
శక్తిసంపన్నుడవైన ప్రభూ! నన్ను నేను నిరాశపరచుకోకుండా
జీవించగలగడాన్ని మించి ఏ తుచ్ఛ సంపదలూ కోరుకోను,
నా చేతల్లో, ఇప్పుడు ఈ కంటితో స్పష్టంగా ఏ ఎత్తులైతే
చూడగలుగుతున్నానో, ఆ ఎత్తులకి ఎదగగలిగేలా ఆశీర్వదించు.
ఆ చేతల విలువ, అది నీ కటాక్షఫలితమే గనుక,
నీవు ఏ ప్రత్యేకత నాకు ప్రసాదించావో అది నా మిత్రుల
ఊహకి అందనివిషయం గనుక,వాళ్ళు దానిని ఎలా నిర్వచించినా,
విలువకట్టినా, వాళ్లని నేను నిరుత్సాహపరచినా, పరచనీ.
అశక్తమైన ఈ చెయ్యి, నా ప్రగాఢమైన నమ్మకానికి తగ్గట్టు పనిచెయ్యనీ
నా జీవితము, నా నోరు ఏది ఉచ్ఛరిస్తే దానిని ఆచరించగలగనీ
ఈ పేలవమైన రాతలు గాని
నా నీచమైన నడవడికగాని,
నీ అంతరార్థము తెలుసుకోలేకపోయానని గాని
నీ కల్పనాలీలని అతిగా ఊహించేననిగాని సూచించకుండుగాక!
.
హెన్రీ డేవిడ్ థరో
(July 12, 1817 – May 6, 1862)
అమెరికను
.
