ఋతువు గడిచిపోయేక… కేట్ లైట్ , అమెరికను కవయిత్రి

ఇప్పుడు నాతో ఏమీ మాటాడొద్దు; నా మానాన్న నన్నుండనీ.
మనం మన బాధల్లో, నష్టాల్లో మునిగిపోయి ఉన్నాం, కనుక
సముద్రంలో మునిగిన ప్రేమికుల్ని గాలమేసిపట్టి తిరిగి కలుపుతున్నాను.

వాళ్ళ గుండెల్లోంచి బాకులు పైకి తీసి, గాయాలకి కుట్లుకుడుతున్నాను
ఎవరు ఎవరిని ప్రేమించారో స్పష్టం చేస్తున్నాను. ఇక్కడనుండి పో!
ఇప్పుడేమీ మాటాడకు; నన్ను నా మానాన్న వదిలెయ్.

నేను పువ్వుల్నీ, మందుల్నీ, శృతిమార్చి వేణువుల్నీ పంపిణీచేస్తున్నాను;
హేమంతంలోకూరుకుపోయిన వసంతాన్ని బయటకి లాగి ఉత్తరాలు తిరగరాస్తున్నాను
సముద్రంలో మునిగిన ప్రేమికుల్ని గాలమేసిపట్టి తిరిగి కలుపుతున్నాను.

నేను పిచ్చిని కుదుర్చుతున్నాను, బందీలకి విముక్తి ప్రసాదిస్తున్నాను,
కళతప్పిన బుగ్గలకి కవోష్ణరుచి తిరిగి అద్దుతున్నాను,
ఇప్పుడు నాతో ఏం మాటాడొద్దు,నన్ను నా మానాన్న వదిలెయ్.

గూఢచారీ, సీతాకోక చిలుకా చక్కని జోడీగా అమరుతారు.
వయొలెట్టాకి ఇప్పుడు చూపించడానికి ఐదు తోటలున్నాయి…
సముద్రంలో మునిగిన ప్రేమికుల్ని గాలమేసిపట్టి తిరిగి కలుపుతున్నాను.

విదూషకుడూ అతని కూతురూ వేరే నగరానికి మారిపోయారు
లూసియా ఇప్పుడు తనజుత్తుకి రంగు వేసుకుంటోంది, తెలుసా?
రా! ఇప్పుడు మనిద్దరం కూచుని, మాటలు కలబోసుకుని
సముద్రంలోంచి రక్షించబడిన ప్రేమికుల్లా తిరిగి కలుద్దాం.
.

కేట్ లైట్
(14 Feb 1960 – 13 Apr 2016)
అమెరికను కవయిత్రి.

Kate Light

.

After the Season 

Do not talk to me just now; let me be.

We were up to our ears in pain and loss, and so

I am reuniting all the lovers, fishing the drowned from the sea.

I am removing daggers from breasts and re-

zipping.  Making it clear who loves whom—please go.

Do not talk to me just now; let me be.

I am redistributing flowers and potions and flutes, changing key;

rewriting letters, pulling spring out of the snow.

I am reuniting all the lovers, fishing the drowned from the sea.

I am making madness sane, setting prisoners free,

cooling the consumptive cheek, the fevered glow.

Do not talk to me just now; let me be.

Pinkerton and Butterfly make such a happy

couple; Violetta has five gardens now to show …

I am reuniting all the lovers, fishing the drowned from the sea.

The jester and his daughter have moved to a distant city.

Lucia colors her hair now, did you know?

Come, let us talk, sit together and be

lovers reunited, fished like the drowned from the sea.

.

Kate Light

(14 Feb 1960 – 13 Apr 2016)

American poet, Lyricist, Librettist

Poem Courtesy:

http://www.poemtree.com/poems/After-the-Season.htm

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: