నల్లకాకి… పాల్ లేక్, అమెరికను కవి

తెల్లవారుతూనే, మా కిటికీ ప్రక్కన తుప్పుపట్టిన గొట్టం చేసే
చప్పుడు లాంటి చప్పుడువిని లేచాము. తెరలు తొలగించి
లేతవెలుగులో డాగ్ హౌస్ వైపు చూడబోతే
పక్కింటి వాళ్ళ పిల్లిమీద ఒక నల్లకాకి ఎంత గట్టిగా అరుస్తోందంటే,
క్షణకాలం, ఈ పక్షులు ఎగిరి పారిపోవాలన్న ఉపాయాన్ని
మరిచిపోయి, బదులుగా, ముక్కు ముందుకి సూదిగా చాపి
మాటకిమాట గట్టిగా, ప్రతిధ్వనించేలా ఎందుకు అరుస్తున్నాయనిపించింది.

తర్వాత దానికి అసలు కారణం తెలిసింది:
కంచెకి దగ్గరలో, పువ్వులులేని డేఫొడిల్స్ కొమ్మల మధ్య
పల్చని రెక్కల పోగు. మళ్ళీ చెట్లకొమ్మలనీడలోకి పోయి
గూడుకట్టడానికి సమయం మించిపోయిందని గ్రహించింది.
అందుకని కుక్కని తరుముతూ, పిల్లిమీద దాడి చేస్తూ
ఆ తల్లి కాకి ఉదయం అల్లా ఎగురుతూనే ఉంది
మొత్తం పెరడంతా తన అధీనంలోకి తీసుకుంటూ.

నేను ఇంటికి ఆఫీసునుండి వచ్చేసరికి నా కారు వంక
భయంకరమైన జంతువుని చూసినట్టు చూస్తూ, తల దానివంకే గురిపెట్టి
నా తలమీంచి ఎగురుతూ, నల్లకాకుల గుంపుకి నాయకత్వం వహిస్తూ
కనిపించింది. ఇంకా దానికి నమ్మకం సడలలేదు.
ఎత్తైన గడ్డిలో మధ్యాహ్నం నేను చూసిన,ఉలుకూ పలుకూ లేని,
కదలకుండా పడున్న వస్తువు మళ్ళీ లేచి ఎగురుతుందేమోనన్న ఆశచావక;
మరణించినవి తల్లి ఆలన పరిధిని దాటిపోలేదు సుమా అని చెబుతున్నట్టు .

.

పాల్ లేక్

జననం 1951

అమెరికను కవి.

.

Blue Jay

A sound like a rusty pump beneath our window

Woke us at dawn.  Drawing the curtains back,

We saw—through milky light, above the doghouse—

A blue jay lecturing a neighbor’s cat

So fiercely that, at first, it seemed to wonder

When birds forgot the diplomacy of flight

And met, instead, each charge with a wild swoop,

Metallic cry, and angry thrust of beak.

Later, we found the reason.  Near the fence

Among the flowerless stalks of daffodils,

A weak piping of feathers.  Too late now to go back

To nest again among the sheltering leaves.

And so, harrying the dog, routing the cat,

And taking sole possession of the yard,

The mother swooped all morning.

                                                    I found her there

Still fluttering round my head, still scattering

The troops of blackbirds, head cocked toward my car

As if it were some lurid animal,

When I returned from work.  Still keeping faith.

As if what I had found by afternoon

Silent and still and hidden in tall grass

Might rise again above the fallen world;

As if the dead were not past mothering.

Paul Lake

Born 1951

American Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/BlueJay.htm

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: