గులాబుల్లో ఏముంది?… ఏ ఎమ్ జస్టర్, అమెరికను కవి

శతాబ్దాలతరబడి అనుకూలమైన
పరంపరాభివృద్ధి వలన గులాబులు
బాగా ముద్దుచేసి పెంచబడిన జాతిగా మారేయి.

వాటి ఆకర్షణ నిజానికి భ్రాంతి.
వాటి బలహీనమైన దళాలు
అడవిలో పెరగడానికి పనికి రావు

వాటిలో నిర్దిష్టంగా కనిపించని అనురూప్యత
సన్నగా బలహీనంగా కనిపించే రీతీ
వైకల్యాన్నికూడా ప్రశంసించేలా చేస్తాయి.

రోడ్డువార చిక్కగా దట్టంగా
అల్లుకుని విరిసే పూలగుత్తులు
ఇంతకంటే మెరుగు

నేనయితే, తమంత తాము నిలబడలేక
పాచిపట్టిన చెట్ల ముళ్ళని సైతం హత్తుకుని
ఎగబాకే లతల్ని ఇష్టపడతాను

అవి వాటిని పీడకలలంత గట్టిగా
దీర్ఘ రోగాలంత దీర్ఘంగా పట్టుకుంటాయి
ఒకవంక అందమైన వెలుగు పొడచూపుతూనే.

ఆనందాన్ని మనసులో కల్పించుకుని
ఒక రూపంపట్ల వ్యామోహాన్ని పెంచుకుని మనం
నిజంగా ఉత్తేజపరిచేవాటిపట్ల ఉదాసీనంగా ఉంటాము

సర్వమూ నశ్వరమైన ఈ సృష్టిలో
గులాబీపూల గుచ్ఛం శాశ్వతానందమనే
పదాన్ని యుక్తిగా కల్పించి భ్రమింపజేస్తుంది.
.

ఏ. ఎమ్ . జస్టర్
జననం 1 అక్టోబరు 1956
అమెరికను కవి, విమర్శకుడు .

.

Against Roses

A long eugenic past

reduces roses to

a vain and pampered caste.

Their charm is artifice,

their fragile shell of cells

unfit for wilderness.

Their languid symmetries

and anorexic airs

exalt deformities.

A run of blossoms, thick

and tangled by the road,

displays a truer pick.

Prefer the bindweed vines

that cannot stand alone

yet clench the mossy spines

of trees and grasp as tight

as nightmares or disease

while hoarding hints of light.

By cloning a delight,

obsessing towards some form,

we dull what should excite.

A rose bouquet contrives

to label wordless joy

when nothing true survives.

A.M. Juster (Michael James Astrue)

1 October 1956

American Poet and Critic

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Against-Roses.htm

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: