1979లో బ్రూక్లిన్… జడ్సన్ జెరోమ్, అమెరికను కవి

ఓ వ్హిట్మన్! ఈ రోజుల్లో నువ్వు జీవించి ఉండాల్సింది
బ్రూక్లిన్ సబ్వేలలో ప్రయాణిస్తూనో, కేబ్ లలో వెళుతూనో;
గాయాలని మాన్చే ప్రయత్నంకాకుండా, మా జీవితాలను
చేదుగా చేసిన గాయాలపై ఎండిన పొక్కులు తొలగిస్తూ.
నువ్వెరిగిన ఆరోగ్యవంతులైన కార్మికులు ఇప్పుడు కార్ఖానాల్లో
వంటింట్లో, ఆఫీసుల్లో, ప్రయోగశాలల్లో ఒదుక్కుని బ్రతుకుతున్నారు.
ఇక్కడి కాంక్రీటు గోడల మధ్య బిక్కుబిక్కు మంటున్న
వాళ్ళ హృదయాలు నీ ప్రేమలో కొంత ధైర్యాన్ని పుంజుకోవచ్చునేమో!
ఓ వాల్ట్! అన్ని చీకటి ప్రదేశాల్లోకీ ఏ సంకోచాలూ లేకుండా
వెళ్ళి అందరితో ఆనందంగా గడిపినవాడివి నువ్వు!
కొనుగోలు దారులు ముసుగులేసుకుని, పైమెరుగుల ముఖాలతో
తిరిగే ఈ వాతానుకూల షాపింగు మాల్స్ లో, నువ్వు నేడు
మా భీతావహమైన ముఖాల్నీ, లేత శరీరాల్నీ గమనించి
మా హుందాతనం ఎక్కడ మాయమయిందో చెవుల్లో గుసగుసలాడవూ?
.
జడ్సన్ జెరోమ్
(February 8, 1927 – August 5, 1991)
అమెరికను కవి .

Judson Jerome

.

Brooklyn 1979

 

Whitman, thou shouldst be living at this hour,

riding the Brooklyn subway or its cabs,

not tending wounds, but picking at the scabs

that crust our lives and turn our lifeblood sour.

The lusty laborers you knew now cower

in factories, kitchens, offices, or labs.

Their furtive hearts behind the concrete slabs

might yet find courage in your loving power.

O Walt, who reached into all secret places

unjudgingly and celebrated all,

now in this air-conditioned shopping mall

where buyers mingle masked, their features glossed,

discern our tender flesh and frightened faces

and whisper where our dignity was lost!

 

Judson Jerome

(February 8, 1927 – August 5, 1991)

American poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Brooklyn1979.htm

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: