చాలారోజుల తర్వాత కలిసినపుడు… జెఫ్ హోల్ట్, అమెరికను కవి

ఆ రోజుల్లో అయితే ప్లాస్టిక్ మెనూ కార్డులమీద
కెచప్ మరకలూ, నలిగిపోయిన పేపర్ మ్యాట్ లమీద
ఇంకిపోయిన నీటి డాగులూ బాధపెట్టి ఉండేవి కావు.
కానీ అదెప్పటి మాట. పదేళ్ళు గడిచిపోయాయి
మేం పెదాలు తుడుచుకుంటూ మాటాడుకుంటున్నాం.
మా జీవితాల్ని సంగ్రహంగా, గానుగెద్దుజీవితాలని
తేల్చుకుని, వెర్రి నవ్వులవెనుక దాచుకున్నాం. లిప్ స్టిక్
అంటుకున్న అతని కాఫీ కప్పు మార్చాలి. అతనికి అర్థం కాని
జోకు చెప్పలేక నేను సతమతమౌతున్నాను, అతను తన కారు గురించి
చెబుతున్న గొప్పలు సగం వింటాను. అతను నాకో సిగరెట్ ఇవ్వబోతాడు
నేను మానేసానని చెబుతాను. ఇంతలో మా బర్గర్లు వస్తాయి.
విసిగెత్తిస్తున్న పెద్దవాళ్ళ కబుర్లు వినలేక అసహంతో
పారిపోడానికి ప్రయత్నించే పిల్లల్లా తినడం ప్రారంభిస్తాము.
బిల్లుకోసం మరో ఐదు నిముషాలు నిరీక్షించవలసి వస్తుంది.
దానితో సరి, మేం ఎవరి త్రోవన వాళ్ళం వెళ్ళి పోడానికి సిద్ధం.
ఇంతకీ, మేము ఏమిటి పునరుద్ధరించుకుందికి ప్రయత్నించేమో అంతుపట్టదు.
.

జెఫ్ హోల్ట్

జననం 1971

అమెరికను కవి

Photo Courtesy: http://blackheartmagazine.com/2015/05/17/dust-to-dust-by-jeff-holt/ 

.

Catching Up

The plastic menus with faint ketchup smears,

The water rings on wrinkled paper mats,

Wouldn’t have bugged us then. But it’s been years.

We wipe and talk.  Summed up, our lives are ruts

Disguised by cheer.  His lipsticked coffee mug

Must be replaced.  I struggle through a joke

He doesn’t get, half-listen to him brag

About his car.  He offers me a smoke.

I say I quit.  Our burgers come.  We eat

Like restless kids who long to get away

From boring grown-up talk.  We have to wait

Five minutes for the check, and then we’re free

To disappear from one another’s view,

Wondering what we wanted to renew.

Jeff Holt

Born 1971

American

Poem Courtesy:

http://www.poemtree.com/poems/CatchingUp.htm

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: