పదవీ విరమణచేస్తున్న గ్రద్ద … రాబర్ట్ ప్రాన్సిస్ , అమెరికను కవి

అందరూ అనుకుంటున్నారు
గ్రద్ద గ్రద్దగా ఉండి విసిగెత్తిపోయిందనీ
దాని రెక్కలు మార్చుకోవాలనుకుంటోందనీ
అంతగా రాజసం లేని మరో పక్షికి
మాటవరసకి, సీగల్ ని, పదవి అప్పగించి
తను తప్పుకోవాలనుకుంటోందని.

హంసలలోనూ, కొంగలలోనూ, బాతులలోనూ
అదే పుకారు వ్యాపించింది,
దాని అధికార హోదా ఏ మాత్రం నచ్చక,
అది నమ్మశక్యంకని కారణమనుకోండి
వీలయితే కేవలం ఒక పక్షిగానే ఉండిపోయి
పదవి విరమించి ప్రశాంతంగా ఉండాలనుకుంటోందని.

ఒక పుకారు వ్యాప్తిలో ఉంది
గ్రద్ద రాష్ట్రీయ చిహ్నంగా
అధికారముద్రలో తన స్థనాన్నీ
తన హక్కును శాశ్వతంగా
విడిచిపెట్టాలని యోచిస్తోందని

ఇలా పదవీ విరమణ చెయ్యాలనుకోవడానికి
కారణం వయసు మీరడమా
కేవలం వృద్ధాప్యానికి చెందిన ఫిర్యాదా
లోపల కుతకుత ఉడికిపోవడమా?
లేదా దానికి వెరే నిగూఢమైన తాత్త్విక కారణాలున్నాయా?

మరో పుకారు చక్కర్లు కొడుతోంది
(దేవుడు మనని రక్షించుగాక) ఒక వృద్ధ యోధుడు
సూర్యుణ్ణిచూసి అరుస్తూ తొడకొట్టినవాడూ
సీజరూ, నెపొలియనుల వెనుక తిరిగినవాడు
ఇపుడు యుద్ధం అంటే తప్పులుపడుతున్నాడని

అతను పదవీ విరమణ చెయ్యడమో
రాజీనామా చెయ్యడమో లేదా
ఎవరికీ అందుబాటులో లేని
ఏకాంత ప్రదేశానికి తరలిపోయి
అక్కడ ఒక కలహం సృష్టించాలనుకుంటున్నాడని
అది కేవలం అతని వ్యక్తిగత కలహం
.

రాబర్ట్ ప్రాన్సిస్

(August 12, 1901 – July 13, 1987)

అమెరికను కవి

.

Photo Courtesy:

Poetry Foundation.org

.

The Disengaging Eagle

.

There is a rumor

      the eagle tires of being eagle

      and would change wing

      with a less kingly bird as king,

      say, the seagull.

      With swans and cranes and geese,

      so the rumor goes,

      finding his official pose

      faintly absurd,

      he would aspire to unofficial peace

      and be, if possible, pure bird.

There is a rumor

      the eagle nurses now a mood

      to abdicate

      forever and for good

      as flagpole-sitter for the State.

      Is it the fall of age

      merely, a geriatrical complaint,

      this drift to disengage,

      this cool unrage?

      or rather some dark philosophical taint?

There is a rumor

      (God save us) the old warrior

      who screamed against the sun

      and toured with Caesar and Napoleon

      cavils now at war

      and would allegedly retire,

      resign, retreat

      to a blue solitude,

      an inaccessible country seat

      to fan a native fire

      a purely personal feud.

Robert Francis

(August 12, 1901 – July 13, 1987)

American poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/DisengagingEagle.htm

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: