అశ్రద్ధచేసిన పూలతోట… రాబర్ట్ క్రాఫర్డ్, స్కాటిష్ కవి

ఆగష్టునెల వచ్చేసరికి నిర్లక్ష్యపుచాయలు గమనించాను
ఇపుడు సెప్టెంబరులో నాకు నైరాశ్యం వచ్చేస్తోంది;
తుప్పుపడుతున్న పనిముట్లు, మాయమవుతున్న వరుసలు,
ఈ ప్రయత్నమంతా తాత్కాలికమని చెప్పకనే చెబుతున్నాయి

ఆశావహంగా ప్రారంభమైన కార్యాచరణ ముగింపుకి వచ్చేసింది
ఇప్పుడిది రాబోయే చెడురోజులను సూచించే కాకిమూకలకీ,
ఏది పడితే అది మొలవడానికి అనుకూలంగా ఎన్నడు
తయారవుతుందా అని ఎదురుచూసే కలుపుమొక్కలకీ నెలవు;

ఈ చక్కని పూలవనాన్ని బీడువారేలా
నిర్లక్ష్యం చేసిన తోటమాలి ఎవరై ఉంటాడు?
నాకు తెలుసని అనుకుంటాను? కొందర్ని కలిసేను కూడా:
అతను సమసమాజం పట్ల పూర్తి విశ్వాసం ఉన్నవాడు…

అటువంటి మనిషి, కొంచెం విపరీతంగా కనిపిస్తాడు,
“ప్రతిదానిపట్లా మనసులో నిజాయితీగా ఉండాలి”
అన్న విశ్వజనీన దృష్టి అతని నినాదం …
కానీ, ఎదుటివాడినుండి పలాయనం అతని ప్రత్యేకత.
.

రాబర్ట్ క్రాఫర్డ్

జననం 1959

స్కాటిష్ కవి 

.

An Abandoned Garden

By August I noticed the lack of care,

And now in September I feel the despair;

The rusting tools, the vanished rows,

Reveal an all too brief affair.

The hopeful beginning has come to a close

As a meeting place for sinister crows

And devious weeds planning for when

They’ll make this a plot where anything goes.

What kind of errant husbandman

Would let it fall to field again?

I think I know, I’ve met a few:

A fine egalitarian—

The type of man, a touch askew,

Who holds the universal view,

“To everything, a heart be true,”

But saves desertion just for you.

.

Robert Crawford

(born 1959)

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Abandoned-Garden.htm

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: