ఆగష్టునెల వచ్చేసరికి నిర్లక్ష్యపుచాయలు గమనించాను ఇపుడు సెప్టెంబరులో నాకు నైరాశ్యం వచ్చేస్తోంది; తుప్పుపడుతున్న పనిముట్లు, మాయమవుతున్న వరుసలు, ఈ ప్రయత్నమంతా తాత్కాలికమని చెప్పకనే చెబుతున్నాయి
ఆశావహంగా ప్రారంభమైన కార్యాచరణ ముగింపుకి వచ్చేసింది ఇప్పుడిది రాబోయే చెడురోజులను సూచించే కాకిమూకలకీ, ఏది పడితే అది మొలవడానికి అనుకూలంగా ఎన్నడు తయారవుతుందా అని ఎదురుచూసే కలుపుమొక్కలకీ నెలవు;
ఈ చక్కని పూలవనాన్ని బీడువారేలా నిర్లక్ష్యం చేసిన తోటమాలి ఎవరై ఉంటాడు? నాకు తెలుసని అనుకుంటాను? కొందర్ని కలిసేను కూడా: అతను సమసమాజం పట్ల పూర్తి విశ్వాసం ఉన్నవాడు…
అటువంటి మనిషి, కొంచెం విపరీతంగా కనిపిస్తాడు, “ప్రతిదానిపట్లా మనసులో నిజాయితీగా ఉండాలి” అన్న విశ్వజనీన దృష్టి అతని నినాదం … కానీ, ఎదుటివాడినుండి పలాయనం అతని ప్రత్యేకత. .