మేం ముసుగు వేసుకుంటాం… పాల్ లారెన్స్ డన్ బార్, అమెరికను కవి

మేము నవ్వుతూ, అబద్ధాలు చెప్పగల ముసుగు వేసుకుంటాం
అది మా బుగ్గలు మరుగుచేసి, కళ్ళకి మెరుపు నిస్తుంది…
అందుకు మనిషి వంచనా శిల్పానికి మేము ఋణపడి ఉన్నాం.
ఒకప్రక్క గుండెలు పగిలి రక్తాలుకారుతున్నా
నవ్వుతూ ఎంతో సునిశితంగా మాటలు అల్లి మాటాడతాం.

మా ప్రతి కన్నీటి బొట్టూ, నిట్టూరుపూ
గణించగల తెలివితేటలు ప్రపంచానికెందుకివ్వాలి?
వీల్లేదు. ప్రపంచాన్ని కేవలం మమ్మల్ని చూడనిస్తాం
కానీ, మేము ముసుగు ధరించే ఉంటాం.

ఓ మహాప్రభూ, క్రీస్తూ! నీ కోసం పిలిచే మా పిలుపులు
చిత్రహింసలు అనుభవిస్తున్న హృదయాలనుండి వెలువడుతున్నవి.
మేము పాడుతూ ఉండొచ్చు, కానీ మా పాదాల క్రింద మట్టి
పరమ నీచమైనది, మా గమ్యం ఇంకా అనంత దూరం;
కానీ ప్రపంచాన్ని మాత్రం వేరేలా తలపోయనీ,
మేము మాత్రం ముసుగు ధరించే ఉంటాం.
.

పాల్ లారెన్స్ డన్ బార్

(June 27, 1872 – February 9, 1906)

అమెరికను కవి

.

.

We Wear the Mask

We wear the mask that grins and lies,

It hides our cheeks and shades our eyes—

This debt we pay to human guile;

With torn and bleeding hearts we smile,

And mouth with myriad subtleties.

Why should the world be over-wise,

In counting all our tears and sighs?

Nay, let them only see us, while

We wear the mask.

We smile, but, O great Christ, our cries

To thee from tortured souls arise.

We sing, but oh the clay is vile

Beneath our feet, and long the mile;

But let the world dream otherwise,

We wear the mask!

.

Paul Laurence Dunbar 

(June 27, 1872 – February 9, 1906)

American Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/WeWearTheMask.htm

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: