రోజు: జూలై 1, 2017
-
మేం ముసుగు వేసుకుంటాం… పాల్ లారెన్స్ డన్ బార్, అమెరికను కవి
మేము నవ్వుతూ, అబద్ధాలు చెప్పగల ముసుగు వేసుకుంటాం అది మా బుగ్గలు మరుగుచేసి, కళ్ళకి మెరుపు నిస్తుంది… అందుకు మనిషి వంచనా శిల్పానికి మేము ఋణపడి ఉన్నాం. ఒకప్రక్క గుండెలు పగిలి రక్తాలుకారుతున్నా నవ్వుతూ ఎంతో సునిశితంగా మాటలు అల్లి మాటాడతాం. మా ప్రతి కన్నీటి బొట్టూ, నిట్టూరుపూ గణించగల తెలివితేటలు ప్రపంచానికెందుకివ్వాలి? వీల్లేదు. ప్రపంచాన్ని కేవలం మమ్మల్ని చూడనిస్తాం కానీ, మేము ముసుగు ధరించే ఉంటాం. ఓ మహాప్రభూ, క్రీస్తూ! నీ కోసం పిలిచే మా…