నేను జీవితాన్ని ఎంచుకోకతప్పదు, ఇక్కడ
నువ్వింత నిర్లక్ష్యంగా ఉంటూ, రహస్యాలేవీ లేనపుడు …
నువ్వు స్టాండుమీదనుండి కొవ్వొత్తి తీసుకుని చీకటి గదుల్లోంచి
దీపంలేని స్నానాలగదిలోకి నడుచుకుంటూ పోతావు
అక్కడ మనిద్దరం మధ్యయుగంనాటి అద్భుతకథలోలా
జంటగా వేడినీటి స్నానం చేస్తాం, ఊసులాడుకుంటూ
సువాసనలు వెదజల్లే ఆవిరిలో స్నానంచేస్తున్నామన్న స్పృహతోనూ…
బయట దట్టంగాకురుస్తున్న రాత్రివర్షానికీ, గీపెడుతున్న
తుఫానుగాలికీ దూరంగా. అన్నిగంటలు కలిసి ఉండడంలో
సంతృప్తి పరచడానికి ఏదీ మిగిలి లేదు; మనిద్దరం
కలుషాలు వీడి, శాంతిపడి, పొడిబారి, సుగంధభరితమైన
శరీరాలతో కలలెరుగని నిద్రలోకి జారుకున్నామని చెప్పడం తప్ప.
అకస్మాత్తుగా,
యేట్స్ మాడ్ గాన్ (Maud Gonne) రాసిన ఉత్తరాలమత్తులో మునిగేడని
నువ్వనడం గుర్తొస్తుంది.
ఎన్ని ఉత్తరాలో! మనిద్దరి మధ్యా, కనీసం ఒకటైనా లేదు.
.
గెరీ కేంబ్రిడ్జ్
జననం 1959
స్కాటిష్ కవి.

Photo Courtesy:
Scottishpoetrylibrary.com
స్పందించండి