ఒక చిన్నగుట్టమీద ఒంటరిగా నిశ్శబ్దంగా ఉన్న శాంతశీలియైన ఒక సాలీడుని అది దానిపరిసరాల్లోని ఖాళీజాగాలని ఎలా వాడుకుందికి ప్రయత్నిస్తుందో గమనించేను. అది ముందుగా దానిపొట్టలోంచి ఒక సన్నని దారాన్ని తీసి దూకింది, అక్కడినుండి అలసటలేకుండా దారాన్ని తీస్తూ అల్లుతూనే ఉంది…
పరీవ్యాప్తమైన, ఎల్లలులేని రోదసిచే చుట్టుముట్టబడి నిర్లిప్తంగా నిలబడ్డ ఓ నా మనసా! నిరంతరం ఆలోచిస్తూ, కనిపిస్తున్న గోళాలచలనాన్ని అర్థంచేసుకుందికి సాహసంతో సిద్ధాంతాలు ప్రతిపాదిస్తూ, విడిచిపెడుతూ, చివరకి నీకు నచ్చిన సిద్ధాంతం దొరికేక, నిరాధారమైన ఆలోచనల వంతెన ఎలాగోలా నిలబడడానికి, అతిసన్నని హేతువుతో అల్లిన ప్రతిపాదనని ఎక్కడైనా పట్టుదొరకకపోతుందా అన్న ఆశతో విసురుతూనే ఉంటావు, కదూ! . వాల్ట్ వ్హిట్మన్ May 31, 1819 – March 26, 1892 అమెరికను కవి
.
A Noiseless Patient Spider
.
A noiseless patient spider,
I mark’d where on a little promontory it stood isolated,
Mark’s how to explore the vacant vast surrounding,
It launch’d forth filament, filament, filament, out of itself,