ఓ ఆత్మా! ఈ శరీరపు అతిథీ! ఫో! ఎవ్వరూ మెచ్చని ఈ పని చేసిపెట్టు; అత్యుత్తమమైన వాటిని ఎంచుకోడానికి వెనుకాడకు; సత్యమొక్కటే నీకు అనుమతి పత్రం. ఫో! ఫో! నాకు మరణం ఆసన్నమయింది. పోయి లోకం చేసే తప్పులు … తప్పులని చెప్పు!
రాజాస్థానికి పోయి అది కుళ్ళిన కట్టెలా వెలుగుతోందని చెప్పు; చర్చికి పోయి అది మంచేదో చెబుతుంది గాని, ఏ మంచీ చెయ్యదని చెప్పు. చర్చిగాని, రాజసభగాని వాదిస్తే, వాళ్ల సమాధానాలు నిర్ద్వంద్వంగా ఖండించు.
అధికారులదగ్గరకి పోయి చెప్పు వాళ్ళు ఇతరుచేస్తున్న సేవలవల్ల బ్రతుకుతున్నారని, వాళ్ళు తగిన ప్రతిఫలం ముట్టచెప్పకపోతే ద్వేషంతో కాదు కుట్రతో సమాధానం చెబుతారని అధికారులు తిరిగి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళ మాటల్లో అసత్యాన్ని ఎత్తి చూపించు.
భోగభాగ్యాలతో తులతూగుతూ ఆస్థిపాస్థుల్ని నిర్వహించుకునే వారితో చెప్పు వాళ్ళ ఆశయం అభ్యుదయమేగాని వాళ్ళ ఆచరణలో మాత్రం ద్వేషం ఉందని. వాళ్లు ఒక్కమాట ఎదురు సమాధానం చెప్పినా ఆ మాటల్లోని అసత్యాన్ని ఎత్తి చూపించు.
కష్టాలు ధైర్యంగా ఎదుర్కొనేవారితో వాళ్లు కష్టాల్ని అనుభవిస్తూ, కొనితెచ్చుకుంటారని, వాళ్లు అలా మూల్యాన్ని చెల్లిస్తూ నలుగురినుండీ కేవలం మెచ్చుకోలు ఆశిస్తారని. వాళ్ళు మాటకిమాట సమాధానం చెప్పేరా వాళ్ళ మాటల్లో డొల్లతనాన్ని ఎత్తి చూపించు.
భక్తితో చెప్పు దానికి శ్రద్ధ అవసరమని ప్రేమతో చెప్పు అది కేవలం కామమేనని కాలానికి చెప్పు అది కేవల ప్రవాహమని ఈ శరీరానికి చెప్పు అది కేవలం మట్టి అని: అవి సమాధానం చెప్పకూఊడదని ఆశించు, ఎందుకంటే నువ్వు వాటిని కాదనవలసి వస్తుంది.
వయసుతో చెప్పు అది ప్రతిరోజునీ వృథా చేస్తోందని గౌరవప్రతిష్ఠలతో చెప్పు అవి ఎంతనిలకడలేనివో, అందంతో చెప్పు అది ఎంత వేగిరం దెబ్బతింటుందో ఔదార్యంతో చెప్పు అది ఎన్ని తప్పటడుగులు వేస్తుందో అవి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తే వాటి తప్పుని నిర్దాక్షిణ్యంగా ఖండించు.
బుద్ధికి చెప్పు అది సున్నితమైన విషయాలలో ఎంతగా చిక్కుల్లోపడుతుందో అలాగే జ్ఞానాకి చెప్పు అదికూడా అతితెలివికి పోయి చిక్కుల్లో చిక్కుకుంటుందో అవి సమాధానం చెప్పడానికి పూనుకోగానే చక్కగా వాటిలోపాన్ని వాటికి ఎత్తి చూపించు.
వైద్యానికి దాని తెగువగురించి హెచ్చరించు నైపుణ్యానికి దాని అలసత్వం గురించి హెచ్చరించు దాతృత్వానికి ఉదాశీనతగురించి హెచ్చరించు చట్టానికి, దాని వాదనప్రతివాదనలగురించి హెచ్చరించు. అవి సమాధానం చెబుతుంటే అందులోని అసత్యాన్ని వేలెత్తి చూపించు.
అదృష్టానికి అది ఎంత గుడ్దిదో వివరించు ప్రకృతికి అది చెందబోయే క్షయం గురించి చెప్పు; స్నేహానికి అందులోని కరకుదనం గురించి చెప్పు న్యాయానికి అందులోని ఆలశ్యం గురించి చెప్పు అవిగాని సమాధానం చెబితే వాటిని ఖండిస్తూ ఎదురుసమాధానం చెప్పు
కళలకి ప్రజలు వాటికిచ్చే విలువలోని తేడాయేతప్ప సహజంగా దేనిలోనూ పరిపక్వత లేదని చెప్పు తత్త్వచింతనలతో అవి లోతుగా ఉండాలని కోరుకుంటాయిగానీ అలా పైపైకి కనిపించడనికే ఎక్కువగా ప్రయతిస్తాయనీ చెప్పు. కళలుగాని, తత్త్వచింతనలు గాని సమాధానం చెబితే కళలూ, తత్త్వచింతనల వాదాలని పూర్వపక్షం చెయ్యి.
విశ్వాసానికి చెప్పు అది వీడు వీడి పోయిందని దేశం ఎలా తప్పులు చేస్తోందో వివరించు మగతనం దయని పక్కనబెడుతుందనీ శీలానికి ఎంతమాత్రం విలువివ్వదనీ చెప్పు. అవి తిరిగి సమాధానం చెబితే ఎదిరించడానికి ఎంతమాత్రం వెనుకాడకు.
నేను నిన్ను ఆదేశించినట్టు చెప్పమన్నవన్నీ ఉన్నదున్నట్టు చెప్పిన తర్వాత, నిజానికి ఇతరుల మాటలని ఖండించడానికి వాళ్ళని చంపడానికి కావలసినంత సాహసం కావాలి; ఎవడికి ఇష్టమయితే వాడిని నిన్ను చంపడానికి ప్రయత్నించనీ ఆత్మని ఏ ఖడ్గాలూ సంహరించలేవు.