నూత్న మహావిగ్రహం… ఎమ్మా లాజరస్, అమెరికను కవయిత్రి

అద్భుతమైన ఈ కవిత అమెరికా దేశపు నాయకత్వం 20 వశతాబ్దం మొదలు వరకూ పాటించిన ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది. చిత్రంగా అదే దేశపు నేటి నాయకుల ఆకాంక్షలూ, అభిప్రాయాలూ దానికి పూర్తిగా వ్యతిరేక దిశలో సాగుతున్నాయి. ఫ్రెంచి ప్రజల సౌహార్ద్ర సూచకంగా అమెరికనులకు బహూకరించబడిన ఈ రాగితో చేసిన విగ్రహాన్ని గుస్తావ్ ఈఫెల్ నిర్మించగా, అక్టోబరు 28, 1886 న జాతికి అంకితం చెయ్యబడింది.  కవయిత్రి మరణించిన 15 సంవత్సరాలకు, 2003 లో Statue of Liberty పదపీఠాన  ఈ కవిత కంచుఫలకంపై చెక్కి ఉంచబడింది. 

*

నిస్సిగ్గుగా నిలుచునే ప్రఖ్యాతివహించిన గ్రీకు విగ్రహంలా కాకుండా,

అన్ని నేలల స్వేచ్చకి సంకేతంగా శృంఖలాలు తెంచుకుని కాళ్ళు ఎడం చేసి

ఇక్కడ, పడమటిదిక్కున సముద్రకెరటాలు జీరాడే “స్వేచ్ఛా ద్వీపంలో”

ఒక మహత్తరమైన స్త్రీమూర్తి నిలుచుని ఉంటుంది చేతిలో దివిటీతో

దాని వెలుగులు శాశ్వతమైన ఊరటకి ప్రతీకలు, ఆమె పేరు

“దేశబహిష్కృతులకు కన్నతల్లి”. కారణం, కాగడా పట్టిన ఆ చేతివెలుగులు

ప్రపంచం నలుమూలలకీ ఆహ్వానాన్ని ప్రసరిస్తాయి; ఈ జంటనగరాలను

అనుసంధానంచేసే ఆ నౌకాశ్రయంలో గాలిని సైతం ఆమె సౌజన్య నేత్రాలు శాసిస్తాయి.

“ఓ ప్రాక్తన దేశాల్లారా! సమాధిగతమైన మీకీర్తిప్రతిష్ఠలను అక్కడే దాచుకొండి!”

అంటూ మౌనంగా హెచ్చరిస్తుంది. ” మీ దేశానికి చెందిన నిరుపేదలనీ, అలసి సొలసినవారినీ,

స్వేఛ్ఛావాయువులు పీల్చుకోడానికి తహతహలాడే లెక్కలేని జనులందరినీ,

మీ దేశతీరాలలో పనికిమాలి వృధాగా పడివున్నవారినందరినీ

గూడులేని, కష్టాలతుఫానులకు గురైన వారందరినీ నా దగ్గరకు పంపించండి.

వాళ్ళందరికీ, ఈ బంగారు వాకిలి తలుపు తెరిచి దీపకళికతో స్వాగతిస్తాను.

.

ఎమ్మా లాజరస్

(July 22, 1849 – November 19, 1887)

అమెరికను కవయిత్రి

.

[This poem is inscribed on the base of the Statue of Liberty.]

The New Colossus

Not like the brazen giant of Greek fame,

With conquering limbs astride from land to land;

Here at our sea-washed, sunset gates shall stand

A mighty woman with a torch, whose flame

Is the imprisoned lightning, and her name

Mother of Exiles.  From her beacon-hand

Glows world-wide welcome; her mild eyes command

The air-bridged harbor that twin cities frame.

“Keep, ancient lands, your storied pomp!” cries she

With silent lips.  “Give me your tired, your poor,

Your huddled masses yearning to breathe free,

The wretched refuse of your teeming shore.

Send these, the homeless, tempest-tost to me,

I lift my lamp beside the golden door!”

Emma Lazarus

(July 22, 1849 – November 19, 1887)

American Poet and Geologist

Poem Courtesy:

http://www.poemtree.com/poems/NewColossus.htm

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: