అనువాదలహరి

దాయాదుల పోరు… ఎలినార్ వైలీ, అమెరికను కవయిత్రి

ఒకసారి, మా ఆయన చిన్నతనంలో, వాళ్ళ నాన్నగారికి

చుట్టాన్ననుకుంటూ ఒకాయన ఇంటికి భోజనానికి  వచ్చేడు,

అతను తొడుక్కున్న బట్ట వెలిసిపోయి, అతనికంటే పాలిపోయి ఉంది.

అతను చూడడానికి గంభీరంగా ఉన్నా, దయాళువుగానే కనిపించాడు;

గాయకుడు సెన్ లాక్ పేరుగలిగిన అతని నవ్వూ, అచ్చం అతనిలానే ఉంది.

అతను బాగా మొగమాటపడుతూ, మర్యాదగా, నవ్వుతూ మాటాడేడు;

“హేమంతం అడుగుపెట్టినదగ్గరనుండీ నేను ఆ అడవిలోనే ఉంటున్నాను,

నాలుగునెలలై ఉంటుంది; మీరన్నది నిజం, చాలారోజులయింది.”

గతంలో అతని దాయాదుల్ని ఇరవైమంది దాకా హతమార్చేడు,

ఏదో వారసత్వం తగువుల్లో, చాలా దారుణమైన పని ఏ రకంగా చూసినా.

అతనికి అది తన విద్యుక్తధర్మంలా తోచింది. చివరకి ఎలాగైతేనేం

అతని ప్రత్యర్థులు అతన్ని అడవిలోని సెలయేటిలో పట్టుకున్నారు.

తెల్లగా అతని తలక్రింద మెరుస్తున్న ఆ సెలయేటి నీరు

అతని మరణంతో, క్రమక్రమంగా ఎరుపురంగు సంతరించుకుంది.

.

ఎలినార్ వైలీ

(September 7, 1885 – December 16, 1928)

అమెరికను కవయిత్రి

.

.

Blood Feud

Once, when my husband was a child, there came

To his father’s table, one who called him kin,

In sun-bleached corduroys paler than his skin.

His look was grave and kind; he bore the name

Of the dead singer of Senlac, and his smile.

Shyly and courteously he smiled and spoke;

“I’ve been in the laurel since the winter broke;

Four months, I reckon; yes, sir, quite a while.”

He’d killed a score of foemen in the past,

In some blood feud, a dark and monstrous thing;

To him it seemed his duty. At the last

His enemies found him by a forest spring,

Which, as he died, lay bright beneath his head,

A silver shield that slowly turned to red.

Elinor Wylie

(September 7, 1885 – December 16, 1928)

American Poet 

Poem Courtesy:

http://www.poemtree.com/poems/BloodFued.htm  

%d bloggers like this: