మృత్యువుతో సమావేశం… ఏలన్ సీగర్, అమెరికను

నాకు మృత్యువుతో సమావేశం ఉంది
ఒకానొక వివాదాస్పదమైన సరిహద్దువెంబడి,
మళ్ళీ వసంతం నీడలగలగలతో
ఆపిలు పూలవాసనలో గాలిలో ఎగజిమ్ముకుంటూ వచ్చినపుడు
నాకు మృత్యువుతో సమావేశం ఉంది…
ఆమని మళ్ళీ వెచ్చని వెలుగులరోజులు తోడ్కొని వచ్చినపుడు.

బహుశ తను నా చేతిని తనచేతిలోకి తీసుకుని
తన చీకటి సామ్రాజ్యంలొకి తీసుకుపోవచ్చు,
నా కళ్ళను మూసి, నా ఊపిరి ఆపవచ్చు…
ఏమో, నేను అతని పక్కనుండి వెళ్లిపోయినా వెళ్ళిపోవచ్చు.
అయినా, నాకు మృత్యువుతో సమావేశం ఉంది
ఫిరంగులతాకిడికి బాగా దెబ్బతిని అందవిహీనమైన
మచ్చలతో కూడిన ఏ కొండవాలులో ఎక్కడో,
మరొకసారి వసంతం యధాప్రకారం వచ్చినపుడు
మైదానాల్లో తొలిచూలుపూలు పొడచూపినపుడు.

మెత్తని పట్టు పరుపుల్లో పడుకోబెట్టబడి
ఆపాదమూ అత్తర్లు పులమబడి
నిద్రలో ప్రేమ అనుభూతిచెందడం మెరుగో
నాడి గబగబా కొట్టుకుంటూ, శ్వాస బిగబట్టుకుంటూ
చప్పుడుచెయ్యకుండా మేలుకోవడం మెరుగో దేముడికెరుక.
అయినా, నాకు మృత్యువుతో సమావేశం ఉంది
ఏ దహించుకుపోతున్న ఏ నగరంలోనో
వసంతం మరొకసరి ఈ ఏడు ఉత్తరదిక్కుకి మరలినపుడు.
నేను ఇచ్చినమాటజవదాటకుండా నడుచుకుంటాను
నా సమావేశాన్ని మాత్రం తప్పించుకోను.
.

ఏలన్ సీగర్

(22 June 1888 – 4 July 1916)

అమెరికను

ఈ కవి మొదటి ప్రపంచయుద్ధంలో ఫ్రెంచి సేనలతొ కలిసి పోరాడుతూ Battle of Somme లో మరణించాడు.

 

.

I have a Rendezvous with Death

.

I have a rendezvous with Death

At some disputed barricade,

When Spring comes back with rustling shade

And apple-blossoms fill the air—

I have a rendezvous with Death

When Spring brings back blue days and fair.

It may be he shall take my hand

And lead me into his dark land

And close my eyes and quench my breath—

It may be I shall pass him still.

I have a rendezvous with Death

On some scarred slope of battered hill,

When Spring comes round again this year

And the first meadow-flowers appear.

God knows ’twere better to be deep

Pillowed in silk and scented down,

Where love throbs out in blissful sleep,

Pulse nigh to pulse, and breath to breath,

Where hushed awakenings are dear . . .

But I’ve a rendezvous with Death

At midnight in some flaming town,

When Spring trips north again this year,

And I to my pledged word am true,

I shall not fail that rendezvous.

Alan Seeger 

(22 June 1888 – 4 July 1916)

American poet who fought and died in World War I during the Battle of the Somme, serving in the French Foreign Legion.

Poem Courtesy:

http://www.poemtree.com/poems/IHaveARendezvousWithDeath.htm

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: