సహ- అనుభూతి … టీ. ఎస్. ఏలియట్ , ఇంగ్లీషు కవి
కాలం ఎంత అనంతమో,
వ్యధాభరితక్షణాలుకూడా అంతే శాశ్వతమని
మనం తెలుసుకుంటాము.
కానీ, ఈ ఎరుక, మన స్వానుభవంలో కంటే,
ఇతరుల మనోవ్యధలతో సహ అనుభూతి ద్వారా
ఎక్కువ సాథ్యపడుతుంది.
కారణం మన గతం మన చేష్టలవల్ల ప్రభావితమౌతుంది;
కానీ ఇతరుల వేదనని ఆ క్షణంలో ఏ షరతులకూ లోబడకుండా
అనుభూతి చెందడమే గాదు, సంతాపప్రకటన తర్వాతకూడా అది సమసిపోదు.
మనుషులు మారతారు; చిరునవ్వులు మొలకెత్తుతాయి; కానీ వేదన శాశ్వతంగా నిలుస్తుంది.
.
టీ. ఎస్. ఏలియట్
(26 September 1888 – 4 January 1965)
ఇంగ్లీషు కవి
Now, we come to discover that the moments of agony
are likewise permanent
With such permanence as time has. We appreciate this better
In the agony of others, nearly experienced,
Involving ourselves, than in our own.
For our own past is covered by the currents of action,
But the torment of others remains an experience
Unqualified, unworn by subsequent attrition.
People change, and smile: but the agony abides.
.
TS Eliot
(26 September 1888 – 4 January 1965)
English Poet
(From: The Dry Salvages)
మార్తా… వాల్టర్ డి లా మేర్, ఇంగ్లీషు కవి
“అనగా అనగా ఒక ఊళ్ళో…”
అలా ఎన్ని సార్లు ప్రారంభించి
మార్తా మాకందరికీ ఆ చిలకపచ్చని
కోనలో ఎన్ని కథలు చెప్పేదో.
ఆమెవి చాలా స్వచ్ఛమైన గోధుమవన్నె కళ్ళు
మీరు గాని వాటిని అలా చూస్తూ ఉంటే
అసలు ఆ కథలన్నీ ఆ కళ్ళు తమ
కలల ప్రశాంతతతో చెబుతున్నట్టు అనిపిస్తుంది.
ఆమె తన సన్నని రెండు చేతులతో
తనముణుకులని బంధించినట్టు కూచునేది;
మేము మాత్రం మా రెండు చేతులమీదా
వెనక్కి వాలి ఆమె వంకే అలా చూసే వాళ్లం.
ఆమె గొంతుకా, కొనదేరిన చుబుకమూ
గంభీరంగా ఉండే ఆమె చిన్న తలా,
కథలో ఆమె వాడిన మాటలకు
సగం అర్థాన్ని చెబుతున్నట్టుండేవి
“అనగా… అనగా… ఒక ఊళ్ళో…”
అది మనం నిద్రలో కనే కలలాంటిది
అవన్నీ ఇప్పుడు అడవిలోని ఏ యక్షిణులో
పిశాచాలో ఎత్తుకుపోయాయి.
సుదూర భవిష్యత్తులో ఆమె అందం కూడా
కనుమరుగౌతుంది; ఆమె గోంతుకొనసాగుతూనే ఉంటుంది,
చివరకి ఈ అడవుల పచ్చదనం,
వేసవి ఎండలూ అన్నీ సమసిపొయేదాకా.
అలసి అలసి అందరూ అన్నీ మరిచిపోతారు;
ఎత్తుగా ఆకాశం మీది మబ్బుల్లా
మా మనసులుకూడా గతించిన ఆ కాలపు
జ్ఞాపకాల మౌనంలో నిశ్చలంగా ఉండిపోయాయి.
.
వాల్టర్ డి లా మేర్
25 April 1873 – 22 June 1956
ఇంగ్లీషు కవి .
.
Martha
.
“Once . . . Once upon a time . . .”
Over and over again,
Martha would tell us her stories,
In the hazel glen.
Hers were those clear gray eyes
You watch, and the story seems
Told by their beautifulness
Tranquil as dreams.
She’d sit with her two slim hands
Clasped round her bended knees;
While we on our elbows lolled,
And stared at ease.
Her voice and her narrow chin,
Her grave small lovely head,
Seemed half the meaning
Of the words she said.
“Once . . . Once upon a time . . .”
Like a dream you dream in the night,
Fairies and gnomes stole out
In the leaf-green light.
And her beauty far away
Would fade, as her voice ran on,
Till hazel and summer sun
And all were gone:—
All fordone and forgot;
And like clouds in the height of the sky,
Our hearts stood still in the hush
Of an age gone by.
.
Walter de la Mare
25 April 1873 – 22 June 1956
English Poet
Poem Courtesy:
http://www.poemtree.com/poems/Martha.htm
ఉత్తరాలు రానపుడు… గెరీ కేంబ్రిడ్జ్, స్కాటిష్ కవి
నేను జీవితాన్ని ఎంచుకోకతప్పదు, ఇక్కడ
నువ్వింత నిర్లక్ష్యంగా ఉంటూ, రహస్యాలేవీ లేనపుడు …
నువ్వు స్టాండుమీదనుండి కొవ్వొత్తి తీసుకుని చీకటి గదుల్లోంచి
దీపంలేని స్నానాలగదిలోకి నడుచుకుంటూ పోతావు
అక్కడ మనిద్దరం మధ్యయుగంనాటి అద్భుతకథలోలా
జంటగా వేడినీటి స్నానం చేస్తాం, ఊసులాడుకుంటూ
సువాసనలు వెదజల్లే ఆవిరిలో స్నానంచేస్తున్నామన్న స్పృహతోనూ…
బయట దట్టంగాకురుస్తున్న రాత్రివర్షానికీ, గీపెడుతున్న
తుఫానుగాలికీ దూరంగా. అన్నిగంటలు కలిసి ఉండడంలో
సంతృప్తి పరచడానికి ఏదీ మిగిలి లేదు; మనిద్దరం
కలుషాలు వీడి, శాంతిపడి, పొడిబారి, సుగంధభరితమైన
శరీరాలతో కలలెరుగని నిద్రలోకి జారుకున్నామని చెప్పడం తప్ప.
అకస్మాత్తుగా,
యేట్స్ మాడ్ గాన్ (Maud Gonne) రాసిన ఉత్తరాలమత్తులో మునిగేడని
నువ్వనడం గుర్తొస్తుంది.
ఎన్ని ఉత్తరాలో! మనిద్దరి మధ్యా, కనీసం ఒకటైనా లేదు.
.
గెరీ కేంబ్రిడ్జ్
జననం 1959
స్కాటిష్ కవి.

Photo Courtesy:
Scottishpoetrylibrary.com
.
The Absence of Letters
I must choose life, and it is here with you
When with a hair-tossed flourish, and all bare,
You take on its stand the candle and walk through
Dark rooms to the unlit bathroom, where we
Like figures from some medieval mystery
Take a hot bath together, whispering, aware
As here we are wreathed in perfumed steam,
Of the whipping night outside and the long scream
Of the gale. There’s nothing else to be satisfied
After our hours together, except we be
Cleansed and calmed and, fragrant, dried,
Then wrapped in dreamless sleep. And suddenly
Poor Yeats, you say, besotted with Maud Gonne!
All those letters! Between us, hardly one.
Gerry Cambridge
(Born 1959)
Scottish Poet
Poem Courtesy:
http://www.scottishpoetrylibrary.org.uk/poetry/poets/gerry-cambridge
తక్కినవాళ్ళు… డేవిడ్ బెర్మన్… అమెరికను కవి
కొందరికి సాహిత్యంలో జీవిత లక్ష్యం దొరుకుతుంది
కొందరికి లలిత కళలలో,
ఎవరికి వారికి అది మనసులోనే దొరుకుతుందన్న
నమ్మికకి కొందరు అంకితమౌతారు.
కొందరికి మదిరలో ఆనందం దొరుకుతుంది
కొందరికి మగువలో
కొందరికి జీవితంలో వెలుగెన్నడూ దొరకదు
వాళ్ళు చీకటితోనే సర్దుకుపోతారు.
మనం వాళ్ళగురించి ఆలోచిస్తున్నప్పుడు
వాళ్ళెప్పుడూ దుఃఖంలో మునిగి ఉన్నట్టు ఊహించుకోవచ్చు;
కానీ, అది నిజం కాదు; వాళ్ళకి కనిపించని ఆ వెలుగు
వాళ్ళెన్నడూ కోరుకున్నది కాదు.
.
డేవిడ్ బెర్మన్
జననం 4 జనవరి 1967
సమకాలీన అమెరికను కవి .
.
And the Others
.
Some find The Light in literature;
Others in fine art,
And some persist in being sure
The Light shines in the heart.
Some find The Light in alcohol;
Some, in the sexual spark;
Some never find The Light at all
And make do with the dark,
And one might guess that these would be
A gloomy lot indeed,
But, no, The Light they never see
They think they do not need.
David Berman
(Born 4 January 1967)
Contemporary American poet, cartoonist, and singer-songwriter best known for his work with indie-rock band the Silver Jews.
http://www.poemtree.com/poems/And-the-Others.htm
శాంతశీలి సాలీడు… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను కవి
ఒక చిన్నగుట్టమీద ఒంటరిగా నిశ్శబ్దంగా ఉన్న
శాంతశీలియైన ఒక సాలీడుని అది దానిపరిసరాల్లోని
ఖాళీజాగాలని ఎలా వాడుకుందికి ప్రయత్నిస్తుందో గమనించేను.
అది ముందుగా దానిపొట్టలోంచి ఒక సన్నని దారాన్ని తీసి దూకింది,
అక్కడినుండి అలసటలేకుండా దారాన్ని తీస్తూ అల్లుతూనే ఉంది…
పరీవ్యాప్తమైన, ఎల్లలులేని రోదసిచే చుట్టుముట్టబడి
నిర్లిప్తంగా నిలబడ్డ ఓ నా మనసా!
నిరంతరం ఆలోచిస్తూ, కనిపిస్తున్న గోళాలచలనాన్ని అర్థంచేసుకుందికి
సాహసంతో సిద్ధాంతాలు ప్రతిపాదిస్తూ, విడిచిపెడుతూ, చివరకి
నీకు నచ్చిన సిద్ధాంతం దొరికేక, నిరాధారమైన ఆలోచనల వంతెన
ఎలాగోలా నిలబడడానికి, అతిసన్నని హేతువుతో అల్లిన ప్రతిపాదనని
ఎక్కడైనా పట్టుదొరకకపోతుందా అన్న ఆశతో విసురుతూనే ఉంటావు, కదూ!
.
వాల్ట్ వ్హిట్మన్
May 31, 1819 – March 26, 1892
అమెరికను కవి
.
A Noiseless Patient Spider
.
A noiseless patient spider,
I mark’d where on a little promontory it stood isolated,
Mark’s how to explore the vacant vast surrounding,
It launch’d forth filament, filament, filament, out of itself,
Ever unreeling them, ever tirelessly speeding them.
And you O my soul where you stand,
Surrounded, detached, in measureless oceans of space,
Ceaselessly musing, venturing, throwing, seeking the spheres to connect them,
Till the bridge you will need be form’d, till the ductile anchor hold,
Till the gossamer thread you fling catch somewhere, O my soul.
Walt Whitman
May 31, 1819 – March 26, 1892
American
Poem Courtesy:
http://www.poemtree.com/poems/NoiselessPatientSpider.htm
స్థూలంగా చూసినపుడు … లార్డ్ టెన్నిసన్, ఇంగ్లీషు కవి
ప్రేమలో, ప్రేమ నిజంగా ప్రేమ అయి, ఆ ప్రేమ మనదైనపుడు
విశ్వాసమూ, విశ్వాసఘాతమూ సమ ఉజ్జీలు ఎన్నడూ కాలేవు;
స్థూలంగా చూసినపుడు అన్నిచోట్లా విశ్వాసఘాతం అంటే, అపనమ్మకమే.
వీణలో ఎక్కడో అతి చిన్న బీట,
క్రమక్రమంగా దానిలోని సంగీతాన్ని హరిస్తూ,
క్రమంగా వ్యాపిస్తూ వ్యాపిస్తూ,దాన్ని పూర్తిగా మూగబోయేట్టు చేస్తుంది.
అలాగే, ప్రేమిక మదివీణియలోని చిన్న బీట
లేదా ఏరినపండ్లమధ్య కనిపించని ఒక చిన్న ముల్లు,
లోలోపలే కుళ్ళిపోయి దానిచుట్టూ బూజుపేరుకునేలా చేస్తుంది
ఇక అది దాచుకుందికి పనికి రాదు; దాన్ని పారవేయవలసిందే:
కానీ అలా చెయ్యగలమా? ఏదీ, ప్రియతమా చెప్పు కాదని చెప్పు.
అయితే నన్ను పూర్తిగా నమ్ము, లేదా అసలు నమ్మకు.
.
లార్డ్ టెన్నిసన్
(6 August 1809 – 6 October 1892)
ఇంగ్లీషు కవి .
.
All in All
In Love, if Love be Love, if Love be ours,
Faith and unfaith can ne’er be equal powers:
Unfaith in aught is want of faith in all.
It is the little rift within the lute,
That by and by will make the music mute,
And ever widening slowly silence all.
The little rift within the lover’s lute,
Or little pitted speck in garner’d fruit,
That rotting inward slowly moulders all.
It is not worth the keeping: let it go:
But shall it? answer, darling, answer, no.
And trust me not at all or all in all.
.
Alfred Lord Tennyson
(6 August 1809 – 6 October 1892)
Poet Laureate of Great Britain
Poem Courtesy:
http://www.poemtree.com/poems/All-in-All.htm
అసత్యం… సర్ వాల్టర్ రాలీ, ఇంగ్లీషు కవి
ఓ ఆత్మా! ఈ శరీరపు అతిథీ! ఫో!
ఎవ్వరూ మెచ్చని ఈ పని చేసిపెట్టు;
అత్యుత్తమమైన వాటిని ఎంచుకోడానికి వెనుకాడకు;
సత్యమొక్కటే నీకు అనుమతి పత్రం.
ఫో! ఫో! నాకు మరణం ఆసన్నమయింది.
పోయి లోకం చేసే తప్పులు … తప్పులని చెప్పు!
రాజాస్థానికి పోయి అది కుళ్ళిన
కట్టెలా వెలుగుతోందని చెప్పు;
చర్చికి పోయి అది మంచేదో చెబుతుంది
గాని, ఏ మంచీ చెయ్యదని చెప్పు.
చర్చిగాని, రాజసభగాని వాదిస్తే,
వాళ్ల సమాధానాలు నిర్ద్వంద్వంగా ఖండించు.
అధికారులదగ్గరకి పోయి చెప్పు వాళ్ళు
ఇతరుచేస్తున్న సేవలవల్ల బ్రతుకుతున్నారని,
వాళ్ళు తగిన ప్రతిఫలం ముట్టచెప్పకపోతే
ద్వేషంతో కాదు కుట్రతో సమాధానం చెబుతారని
అధికారులు తిరిగి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తే
వాళ్ళ మాటల్లో అసత్యాన్ని ఎత్తి చూపించు.
భోగభాగ్యాలతో తులతూగుతూ
ఆస్థిపాస్థుల్ని నిర్వహించుకునే వారితో చెప్పు
వాళ్ళ ఆశయం అభ్యుదయమేగాని
వాళ్ళ ఆచరణలో మాత్రం ద్వేషం ఉందని.
వాళ్లు ఒక్కమాట ఎదురు సమాధానం చెప్పినా
ఆ మాటల్లోని అసత్యాన్ని ఎత్తి చూపించు.
కష్టాలు ధైర్యంగా ఎదుర్కొనేవారితో
వాళ్లు కష్టాల్ని అనుభవిస్తూ, కొనితెచ్చుకుంటారని,
వాళ్లు అలా మూల్యాన్ని చెల్లిస్తూ
నలుగురినుండీ కేవలం మెచ్చుకోలు ఆశిస్తారని.
వాళ్ళు మాటకిమాట సమాధానం చెప్పేరా
వాళ్ళ మాటల్లో డొల్లతనాన్ని ఎత్తి చూపించు.
భక్తితో చెప్పు దానికి శ్రద్ధ అవసరమని
ప్రేమతో చెప్పు అది కేవలం కామమేనని
కాలానికి చెప్పు అది కేవల ప్రవాహమని
ఈ శరీరానికి చెప్పు అది కేవలం మట్టి అని:
అవి సమాధానం చెప్పకూఊడదని ఆశించు,
ఎందుకంటే నువ్వు వాటిని కాదనవలసి వస్తుంది.
వయసుతో చెప్పు అది ప్రతిరోజునీ వృథా చేస్తోందని
గౌరవప్రతిష్ఠలతో చెప్పు అవి ఎంతనిలకడలేనివో,
అందంతో చెప్పు అది ఎంత వేగిరం దెబ్బతింటుందో
ఔదార్యంతో చెప్పు అది ఎన్ని తప్పటడుగులు వేస్తుందో
అవి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తే
వాటి తప్పుని నిర్దాక్షిణ్యంగా ఖండించు.
బుద్ధికి చెప్పు అది సున్నితమైన
విషయాలలో ఎంతగా చిక్కుల్లోపడుతుందో
అలాగే జ్ఞానాకి చెప్పు అదికూడా
అతితెలివికి పోయి చిక్కుల్లో చిక్కుకుంటుందో
అవి సమాధానం చెప్పడానికి పూనుకోగానే
చక్కగా వాటిలోపాన్ని వాటికి ఎత్తి చూపించు.
వైద్యానికి దాని తెగువగురించి హెచ్చరించు
నైపుణ్యానికి దాని అలసత్వం గురించి హెచ్చరించు
దాతృత్వానికి ఉదాశీనతగురించి హెచ్చరించు
చట్టానికి, దాని వాదనప్రతివాదనలగురించి హెచ్చరించు.
అవి సమాధానం చెబుతుంటే
అందులోని అసత్యాన్ని వేలెత్తి చూపించు.
అదృష్టానికి అది ఎంత గుడ్దిదో వివరించు
ప్రకృతికి అది చెందబోయే క్షయం గురించి చెప్పు;
స్నేహానికి అందులోని కరకుదనం గురించి చెప్పు
న్యాయానికి అందులోని ఆలశ్యం గురించి చెప్పు
అవిగాని సమాధానం చెబితే
వాటిని ఖండిస్తూ ఎదురుసమాధానం చెప్పు
కళలకి ప్రజలు వాటికిచ్చే విలువలోని తేడాయేతప్ప
సహజంగా దేనిలోనూ పరిపక్వత లేదని చెప్పు
తత్త్వచింతనలతో అవి లోతుగా ఉండాలని కోరుకుంటాయిగానీ
అలా పైపైకి కనిపించడనికే ఎక్కువగా ప్రయతిస్తాయనీ చెప్పు.
కళలుగాని, తత్త్వచింతనలు గాని సమాధానం చెబితే
కళలూ, తత్త్వచింతనల వాదాలని పూర్వపక్షం చెయ్యి.
విశ్వాసానికి చెప్పు అది వీడు వీడి పోయిందని
దేశం ఎలా తప్పులు చేస్తోందో వివరించు
మగతనం దయని పక్కనబెడుతుందనీ
శీలానికి ఎంతమాత్రం విలువివ్వదనీ చెప్పు.
అవి తిరిగి సమాధానం చెబితే
ఎదిరించడానికి ఎంతమాత్రం వెనుకాడకు.
నేను నిన్ను ఆదేశించినట్టు చెప్పమన్నవన్నీ
ఉన్నదున్నట్టు చెప్పిన తర్వాత,
నిజానికి ఇతరుల మాటలని ఖండించడానికి
వాళ్ళని చంపడానికి కావలసినంత సాహసం కావాలి;
ఎవడికి ఇష్టమయితే వాడిని నిన్ను చంపడానికి ప్రయత్నించనీ
ఆత్మని ఏ ఖడ్గాలూ సంహరించలేవు.
.
సర్ వాల్టర్ రాలీ
1554 – 29 October 1618
ఇంగ్లీషు కవి .
.
The Lie
.
Go, soul, the body’s guest,
Upon a thankless arrant: [errand]
Fear not to touch the best;
The truth shall be thy warrant.
Go, since I needs must die,
And give the world the lie.
Say to the court, it glows
And shines like rotten wood;
Say to the church, it shows
What’s good, and doth no good:
If church and court reply,
Then give them both the lie.
Tell potentates, they live
Acting by others’ action,
Not loved unless they give,
Not strong but by a faction:
If potentates reply,
Give potentates the lie.
Tell men of high condition
That manage the estate,
Their purpose is ambition,
Their practice only hate:
And if they once reply,
Then give them all the lie.
Tell them that brave it most,
They beg for more by spending,
Who, in their greatest cost,
Seek nothing but commending:
And if they make reply,
Then give them all the lie.
Tell zeal it wants devotion;
Tell love it is but lust;
Tell time it is but motion;
Tell flesh it is but dust:
And wish them not reply,
For thou must give the lie.
Tell age it daily wasteth;
Tell honour how it alters;
Tell beauty how she blasteth;
Tell favour how it falters:
And as they shall reply,
Give every on the lie.
Tell wit how much it wrangles
In tickle points of niceness;
Tell wisdom she entangles
Herself in over-wiseness:
And when they do reply,
Straight give them both the lie.
Tell physic of her boldness;
Tell skill it is prevention;
Tell charity of coldness;
Tell law it is contention:
And as they do reply,
So give them still the lie.
Tell fortune of her blindness;
Tell nature of decay;
Tell friendship of unkindness;
Tell justice of delay:
And if they will reply,
Then give them all the lie.
Tell arts they have no soundness,
But vary by esteeming;
Tell schools they want profoundness,
And stand too much on seeming:
If arts and schools reply,
Give arts and schools the lie.
Tell faith it’s fled the city;
Tell how the country erreth;
Tell, manhood shakes off pity;
Tell, virtue least preferreth:
And if they do reply
Spare not to give the lie.
So when thou hast, as I
Commanded thee, done blabbing,
Although to give the lie
Deserves no less than stabbing,
Stab at thee he that will,
No stab the soul can kill.
.
Sir Walter Raleigh
1554 – 29 October 1618
English Poet
Poem Courtesy:
http://www.poemtree.com/poems/Lie.htm
సత్యదర్శనము… కొవెంట్రీ పాట్ మోర్, ఇంగ్లీషు కవి
ఒక వ్యర్థ కవి, నూటికొక్కడు
తనపరిసరాల్ని పరికిస్తాడు, కానీ, తక్కినపుడు
అతని అవగాహనకి అందనంత సౌందర్యవంతంగా ఉండే సృష్టి,
అతనికి కుకవి హాస్యం కంటే పేలవంగా కనిపిస్తుంది.
ప్రేమ ప్రతి వ్యక్తినీ జీవితంలో ఒక్కసారి మేల్కొలుపుతుంది;
మనిషి తన బరువైన కనులెత్తి, పరికిస్తాడు;
ఆహ్! ఒక సౌందర్యవంతమైన పేజీ బోధించలేనిదేమున్నది!
దాన్ని ఆనందంతో చదువుతారు, మళ్ళీ పుస్తకం మూసేస్తారు.
కొన్ని కృతజ్ఞతలూ, కొన్ని దూషణలూ గడచిన తర్వాత,
చాలమంది అన్నీ మరిచిపోతారు, కానీ, ఎలా చూసినా,
గుర్తుపెట్టుకోలేని చిన్నపిల్లవాడి కలలా, అది
వాళ్లజీవితంలో మధురమైన ఒకే ఒక సందర్భంగా మిగిలిపోతుంది.
.
కొవెంట్రీ పాట్ మోర్
(23 July 1823 – 26 November 1896)
ఇంగ్లీషు కవి.
.
The Revelation
.
An idle poet, here and there,
Looks round him, but, for all the rest,
The world, unfathomably fair,
Is duller than a witling’s jest.
Love wakes men, once a lifetime each;
They lift their heavy lids, and look;
And, lo, what one sweet page can teach,
They read with joy, then shut the book.
And give some thanks, and some blaspheme,
And most forget, but, either way,
That and the child’s unheeded dream
Is all the light of all their day.
.
Coventry Patmore
(23 July 1823 – 26 November 1896)
English Poet
Poem Courtesy:
http://www.poemtree.com/poems/Revelation.htm
రసగీతి… విలియం ఓల్డిస్ , ఇంగ్లండు
క్షణం తీరికలేక, కుతూహలంతో, దాహంతో తిరిగే ఓ ఈగా,
నేను తాగుతున్నట్టుగానే, నెమ్మదిగా ఈ పానీయం తాగు;
నా కప్పు మీదకి నిన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాను,
నువ్వు దీన్ని తాగగలిగితే, సొక్కి సోలు;
నీ జీవితంనుండి పొందగలిగినంత పొందు,
జీవితం చాలా క్షణికం, త్వరగా కరిగిపోతుంది.
నీదీ నాదీ ఒక్క తీరే,
కాలం త్వరగా అస్తమదిక్కుకి పరిగెడుతుంది;
నీది ఒక్క వసంతమే, నాదీ అంతకంటే ఎక్కువేం కాదు,
కాకపొతే అది మూడు ఇరవైల వసంతాలు తిరుగుతుంది;
ఆ మూడు అరవైలూ గడిచిన తర్వాత
అవి ఒక్క ఏడులో ముగిసిపోయినట్తు అనిపిస్తుంది.
.
విలియమ్ ఓల్డిస్
(14 July 1696 – 15 April 1761)
ఇంగ్లండు
.
An Anacreontick
Busy, curious, thirsty Fly,
Gently drink, and drink as I;
Freely welcome to my Cup,
Could’st thou sip, and sip it up;
Make the most of Life you may,
Life is short and wears away.
Just alike, both mine and thine,
Hasten quick to their Decline;
Thine’s a Summer, mine’s no more,
Though repeated to threescore;
Threescore Summers when they’re gone,
Will appear as short as one.
William Oldys Herald
(14 July 1696 – 15 April 1761)
English Antiquarian and Bibliographer
Poem Courtesy:
http://www.poemtree.com/poems/An-Anacreontick.htm