పైగా, ఏరోన్ స్టార్క్ చాలా బక్కపలచని మనిషి, శాపగ్రస్తుడు;
మురికిగా, శుష్కించి, ఎప్పుడూ ఏదోపోయినట్టు, తగువులాడుతూ ఉంటాడు.
అతనొక పిసినారి, తగ్గట్టే ముక్కుకూడా ఉందా లేదా అన్నట్టు ఉంటుంది,
అతని కళ్ళు చీకట్లో చిరునాణేల్లా ఉంటాయి.
అతని గీతగీసినట్టున్న నోరు అక్కడొక ఆనవాలులా ఉంటుంది;
అతను మాటాడినపుడు నోటంట వచ్చే ఆ రెండుమూడు శబ్దాలూ
ఎడమైనకోరలమధ్యనుండి కోపంతో వచ్చే బుసలా ఉండి,
కుక్క దాని అరుపుకే భయపడి జాగ్రత్తపడినట్టు ఆగిపోతాయి.
అతనికున్న చెడ్డపేరుకి సంతోషిస్తూనే
ప్రేమచేబహిష్కృతుడైన అతడు కర్రపట్టుకుని
ఊరంతా విచ్చలవిడిగా తిరుగుతుంటాడు;
అప్పుడప్పుడు అతని చెవుల్లోకి ఎక్కడో దూరాన్నుండి
జొరబడిన అజ్ఞాత కరుణార్ద్రమైన మాటలు మనసుతాకి,
కళ్ళు చెమర్చినపుడు, అప్పుడే, ఏరోన్ ఒక చిరునవ్వు నవ్వుతుంటాడు.
.
E. A. రాబిన్సన్
(December 22, 1869 – April 6, 1935)
అమెరికను
.
.
Aaron Stark
Withal a meagre man was Aaron Stark,
Cursed and unkempt, shrewd, shrivelled, and morose.
A miser was he, with a miser’s nose,
And eyes like little dollars in the dark.
His thin, pinched mouth was nothing but a mark;
And when he spoke there came like sullen blows
Through scattered fangs a few snarled words and close,
As if a cur were chary of its bark.
Glad for the murmur of his hard renown,
Year after year he shambled through the town,
A loveless exile moving with a staff;
And oftentimes there crept into his ears
A sound of alien pity, touched with tears,—
And then (and only then) did Aaron laugh.
E.A. Robinson
(December 22, 1869 – April 6, 1935)
American
(Winner of 3 Pulitzer Prizes and nominated for Nobel 4 times)
Poem Courtesy:
http://www.poemtree.com/poems/Aaron-Stark.htm
స్పందించండి