రోజు: మే 30, 2017
-
ఏరోన్ స్టార్క్… E.A. రాబిన్సన్, అమెరికను
పైగా, ఏరోన్ స్టార్క్ చాలా బక్కపలచని మనిషి, శాపగ్రస్తుడు; మురికిగా, శుష్కించి, ఎప్పుడూ ఏదోపోయినట్టు, తగువులాడుతూ ఉంటాడు. అతనొక పిసినారి, తగ్గట్టే ముక్కుకూడా ఉందా లేదా అన్నట్టు ఉంటుంది, అతని కళ్ళు చీకట్లో చిరునాణేల్లా ఉంటాయి. అతని గీతగీసినట్టున్న నోరు అక్కడొక ఆనవాలులా ఉంటుంది; అతను మాటాడినపుడు నోటంట వచ్చే ఆ రెండుమూడు శబ్దాలూ ఎడమైనకోరలమధ్యనుండి కోపంతో వచ్చే బుసలా ఉండి, కుక్క దాని అరుపుకే భయపడి జాగ్రత్తపడినట్టు ఆగిపోతాయి. అతనికున్న చెడ్డపేరుకి సంతోషిస్తూనే ప్రేమచేబహిష్కృతుడైన అతడు…
-
నీలిదుస్తుల విద్యార్థినులు … జాన్ క్రో రాన్ సమ్, అమెరికను
మీ నీలి గౌన్లను గిరగిర తిప్పుకుంటూ, మీ బడిని ఆనుకున్న పచ్చనిపొలాలలో నడుచుకుంటూ మీ గురువృద్ధులు చెప్పింది వినండి పిల్లలూ; కానీ, అందులో ఒక్కముక్కకూడా నమ్మకండి. మీ తలకట్టు చుట్టూ తెల్లని కేశబంధాల్ని తగిలించి, గడ్డిమీద ఎగురుకుంటూ ఉబుసుపోకమాటలు చెప్పుకునే నీలి నీలి పిట్టల్లా ఇక జరగబోయేదానికి ఆలోచించడం మానెయ్యండి. ఇదిగో నీలి దుస్తుల అమ్మాయిలూ, అంతరించకమునుపే మీ చక్కదనాన్ని సాధనచెయ్యండి. నేను పెద్ద గొంతుకతో నలుగురికీ ప్రకటిస్తాను:దాన్ని మన అధీనంలోని సమస్త శక్తులూ నిర్ణయించలేవని. చక్కదనం…