యువ వీరులకు నివాళి… విల్ఫ్రెడ్ ఓవెన్ , ఇంగ్లీషు కవి

సొమ్ముల్లా రాలిపోయిన ఈ యువతకి ఇవేమి మృత్యుఘంటికలు?!

అవి భయానకమైన శతఘ్నుల కోపోద్దీపితమైన అరుపులు మాత్రమే

డగడగ…డగడగమని ఆగకుండా తూటాలు విరజిమ్మే తుపాకుల

చప్పుడు మాత్రమే వారి కడసారి ప్రార్థనలు త్వరగా వల్లెవేయగలదు.

వారిని శ్లాఘిస్తూ ఏ ఉపన్యాసాలూ లేవు; ఏ ప్రార్థనలూ, గంటలూ లేవు.

ఈ విషాద సంగీతం తప్ప వేరు శోక సంకేతాలు లేవు.

అవిగో కీచుగా, పిచ్చిపట్టినట్టు శోకించే తూటాల ఆక్రందనలు,

యువవీరులని జన్మభూమికి రారమ్మంటున్న తుత్తారల గద్గద నిస్వనాలు.

వారికి అంతిమ వీడ్కోలు ఇవ్వడానికి మనం ఏకొవ్వొత్తులు చూపగలం?

అవి ఆ పిల్లల చేతులలో లేవు, వాళ్ళ కళ్ళల్లో ఉన్నాయి

అవి కడసారి వీడ్కోలు ఇస్తూ దివ్యంగా వెలుగుతున్నాయి.

వెలవెలబోయిన వారిస్త్రీల ఫాలభాగాలే వాళ్ళకి నల్లని ముసుగులు

ఎంతో భవితకలిగిన వారి మెదళ్ళ సౌకుమార్యమే వారికి పూలజల్లు

నెమ్మదిగా అస్తమిస్తున్న ప్రతిసాయంత్రమూ వారిపై మూసుకుంటున్న చీకటితెర.

.

విల్ఫ్రెడ్ ఓవెన్

(18 March 1893 – 4 November 1918)

ఇంగ్లీషు కవి

 .

 

.

Anthem for Doomed Youth

What passing-bells for these who die as cattle?

Only the monstrous anger of the guns.

Only the stuttering rifles’ rapid rattle

Can patter out their hasty orisons.

No mockeries now for them; no prayers nor bells,

Nor any voice of mourning save the choirs,—

The shrill, demented choirs of wailing shells;

And bugles calling for them from sad shires.

What candles may be held to speed them all?

Not in the hands of boys, but in their eyes

Shall shine the holy glimmers of good-byes.

The pallor of girls’ brows shall be their pall;

Their flowers the tenderness of patient minds,

And each slow dusk a drawing-down of blinds.

Wilfred Owen

(18 March 1893 – 4 November 1918)

English Poet and Soldier

Poem Courtesy:

http://www.poemtree.com/poems/AnthemForDoomedYouth.htm

“యువ వీరులకు నివాళి… విల్ఫ్రెడ్ ఓవెన్ , ఇంగ్లీషు కవి” కి 2 స్పందనలు

  1. P. సాంబశివరావు Avatar
    P. సాంబశివరావు

    Sir! Cattle అంటే సొమ్మలు! సొమ్ములు కాదు.

    మెచ్చుకోండి

    1. సాంబశివరావుగారూ,

      విశాఖపట్నం, శ్రీకాకుళం మాండలికంలో పశువులకి “సొమ్ములు” అనే వ్యవహరిస్తారు. సొమ్మలు కాదు. రావిశాస్త్రిగారి ప్రఖ్యాత నవల “సొమ్ములుపోనాయండి” మీకు గుర్తుండే ఉంటుంది.

      నా బ్లాగు చూడడానికి సమయం వెచ్చించినందుకు కృతజ్ఞతలు.

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: