నువ్వు గ్రహించగలిసినదంతా గ్రహించు…
ప్రతి రోజూ… ప్రతి క్షణమూ…
ప్రతి ౠతువూ… నీ జీవించినంతకాలమూ.
అప్పుడు భవిష్యత్తులోకి ధైర్యంగా చూడగలవు
గతాన్ని విచారంలేకుండా అవలోడనంచేసుకోగలవు.
నువ్వు నీలాబ్రతుకు, కానీ నీలోని ఉత్తమోత్తమపార్శ్వాన్ని చూపు.
భిన్నంగా ఉండడానికి సాహసించు; నీ భవిత నువ్వే వెతుక్కో…
ఆనందంగా ఉండడానికి ఎంతమాత్రం వెరవకు!
సౌందర్యాన్ని ఆస్వాదించు.
ప్రతిదాన్నీ మనసారా, హృదయపూర్వకంగా ప్రేమించు.
నిన్ను ప్రేమించేవారిపై నమ్మకం ఉంచు.
ఒక నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్నప్పుడు,
నిర్ణయాన్ని ఎంత వివేకంతో, తొందరగా తీసుకోగలవో,
అంత వివేకంతో, త్వరగా తీసుకుని ఆ విషయం మరిచిపో.
నిస్సందేహంగా తీసుకోగల క్షణం ఎన్నడూ రాదు.
అన్నిటికన్నా ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకో:
భగవంతుడు పరులకి సాయంచేసినవారికే సాయంచేస్తాడు.
అన్నీ నీ మీదే ఆధారపడి ఉన్నట్టు ప్రవర్తించు;
అన్నీ భగవంతునిమీదే ఆధారపడి ఉన్నట్టు ప్రార్థించు.
ఎప్పుడూ ఆనందంగా ఉండు.
.
జోస్ వాండర్లీ దీయాస్
పోర్చుగీసు కవి.
.
Live every day as much
.
స్పందించండి