ఓ నా మిత్తికా! నువ్వూ గతించవలసిందే!… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే అమెరికను కవయిత్రి
ఓ నా ప్రియ మిత్తికా! నువ్వూ గతించవలసిందే! ఇంత నీ సౌందర్యమూ నిన్ను ఎంతమాత్రం కాపాడలేదు; ఎక్కడా లోపం కనరాని ఈ నిపుణ హస్తమూ, అందమైన శిరసూ, జ్వలించే ఉక్కులాంటి ఈ శరీరమూ, సుడిగాలివంటి మృత్యువు ముందు, లేదా దానీ హేమంత హిమపాతం ముందు, ఏ ఆకు రాలడానికి భిన్నంగా లేకుండా, మొట్టమొదటి ఆకు రాలినట్టు రాలిపోక తప్పదు; ఈ అద్భుతం తెరమరుగుకాక తప్పదు… మార్పుకిలోనై, అందరికీ దూరమై, చివికి శిధిలమై. ఆ సమయంలో నా ప్రేమకూడా నిన్ను రక్షించలేదు. ఇంత నా ప్రేమ నిన్ను వెన్నంటి ఉన్నా, ఆ రోజు నువ్వు శరీరంనుండి లేచి వాయుమార్గంలో ప్రయాణం చేస్తావు … ఎవ్వరూ పట్టించుకోని పువ్వులా ఏ గుర్తింపూ లేకుండా. నువ్వు ఎంత అందంగా ఉన్నావన్నది అక్కడ ప్రశ్నేకాదు మరణించింది అన్నిటికంటే ఎంత ప్రియమైనదన్నదీ కాదు.
స్పందించండి