రోజు: మే 21, 2017
-
ఆ కొండ… ఎడ్గార్ లీ మాస్టర్స్, అమెరికను కవి
ఎల్మర్, హెర్మన్, బెర్త్, టామ్, ఛార్లీ అంతా ఏరీ, స్థిరచిత్తం లేని వాళ్లూ, భుజబలం కలిగినవాళ్ళూ, హాస్యగాడూ, తాగుబోతూ, యోధుడూ…ఏరీ? అందరూ… అందరూ ఆ కొండమీద నిద్రిస్తున్నారు. ఒకరు జ్వరంతో పోయారు ఒకరు గనిలో కాలిపోయారు ఒకరు తగవులాటలో మరణించేరు మరొకరు చెరసాలలో మరణించేరు. భార్యాబిడ్డల్ని పోషించడానికి పనిచేస్తూ మరొకరు వంతెనమీంచి జారిపోయారు వాళ్ళంతా… అంతా… ఇప్పుడు ఆ కొండమీద నిద్రిస్తున్నారు. ఎలా, కేట్, మేగ్, లిజ్జీ, ఎడిత్ వీరంతా ఏరీ. మెత్తని మనసూ, అమాయకత్వం, గయ్యాళితనం,…