ఓ మనసా! కాస్త నెమ్మది వహించు; నీ అస్త్రాలు ఎందుకూ పనికిరావు, భూమ్యాకాశాల దగ్గర ఇంతకన్నా బలమైనవి ఎప్పటినుండో స్థిరంగా ఉన్నాయి. ఆలోచించు. ఒకసారి గుర్తుతెచ్చుకో, ఇప్పుడు నువ్వు విచారిస్తున్నావు గాని, ఒకప్పుడు మనం అచేతనంగా పడి ఉండే వాళ్ళం. ఆ రోజులు అనంతం.
అప్పుడూ మనుషులు నిర్దాక్షిణ్యంగా ఉండెవారు; ణెను ఆ చీకటి గుహలో పడుకున్నాను అందుకు చూడలేదు; కన్నీళ్ళు చిందేవి, కానీ విచారించలేదు; చెమట కారేది, రక్తం ఉడుకెత్తేది, కానీ నే నెన్నడూ విచారించలెదు; నేను పుట్టకమునుపు ఆ రోజుల్లో అప్పటికది అంతా బాగానే ఉండేది.
ఇప్పుడు నేను కారణాలు వెతుకుతాను కానీ సమాధానం కనిపించదు, నేను నేలనలుచెరగులా తిరుగుతాను, నిత్యం గాలిపీలుస్తూ, సూర్యుణ్ణి ఆనందిస్తాను మనసా! కాస్త నెమ్మది వహించు: ఇదెన్నాళ్లుంటుది, క్షణికమే: అన్యాయం జరిగితే జరగనీ, దాన్ని కొంతకాలం సహిద్దాము.
ఇదిగో చూడు! మిన్నూ మన్నూ పునాదులదగ్గరనుండి రుజాగ్రస్తమయ్యాయి. మనసుని ముక్కలు చెయ్యగల అన్ని ఆలోచనలూ ఉన్నాయి; అవన్నీ నిష్ఫలం. భీతి, ఏవగింపు, వెటకారం, భయం, పట్టలేని ఆగ్రహం — అయ్యో! నేనెందుకు మేల్కొన్నాను? మళ్ళీ ఎప్పుడు నిద్రలోకి జారుకుంటాను? .
ఏ. ఇ. హౌజ్మన్ (26 March 1859 – 30 April 1936) ఇంగ్లీషు కవి .
.
Be Still, My Soul, Be Still
.
Be still, my soul, be still; the arms you bear are brittle,
Earth and high heaven are fixt of old and founded strong.
Think rather,—call to thought, if now you grieve a little,
The days when we had rest, O soul, for they were long.
Men loved unkindness then, but lightless in the quarry
I slept and saw not; tears fell down, I did not mourn;
Sweat ran and blood sprang out and I was never sorry:
Then it was well with me, in days ere I was born.
Now, and I muse for why and never find the reason,
I pace the earth, and drink the air, and feel the sun.
Be still, be still, my soul; it is but for a season:
Let us endure an hour and see injustice done.
Ay, look: high heaven and earth ail from the prime foundation;
All thoughts to rive the heart are here, and all are vain:
Horror and scorn and hate and fear and indignation—