రోజు: మే 20, 2017
-
మనసా! కాస్త నెమ్మది… A E హౌజ్మన్, ఇంగ్లీషు కవి
ఓ మనసా! కాస్త నెమ్మది వహించు; నీ అస్త్రాలు ఎందుకూ పనికిరావు, భూమ్యాకాశాల దగ్గర ఇంతకన్నా బలమైనవి ఎప్పటినుండో స్థిరంగా ఉన్నాయి. ఆలోచించు. ఒకసారి గుర్తుతెచ్చుకో, ఇప్పుడు నువ్వు విచారిస్తున్నావు గాని, ఒకప్పుడు మనం అచేతనంగా పడి ఉండే వాళ్ళం. ఆ రోజులు అనంతం. అప్పుడూ మనుషులు నిర్దాక్షిణ్యంగా ఉండెవారు; ణెను ఆ చీకటి గుహలో పడుకున్నాను అందుకు చూడలేదు; కన్నీళ్ళు చిందేవి, కానీ విచారించలేదు; చెమట కారేది, రక్తం ఉడుకెత్తేది, కానీ నే నెన్నడూ విచారించలెదు;…