రోజు: మే 19, 2017
-
తుదిశ్వాస విడిచిన తర్వాత… థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి
(జెమీమా హార్డీ (1813 – 1904) స్మృతిలో ) . ఇక చెయ్యడానికీ, భయపడడానికీ, ఆశించడానికీ ఏమీ లేదు; ఇక ఎవ్వరూ కనిపెట్టుకుని ఉండనక్కరలేదు;చిన్నగొంతుతో మాటాడడాలూ, విసిగి వేసారడాలూ ఉండవు; దుప్పటిమీద ఇబ్బందిగా కనిపించే ముడతలు సరిదిద్దనక్కరలేదు, తలగడ ఆమెకు వాలులో పెట్టనక్కరలేదు. మేము శూన్యదృక్కులతో చూస్తున్నాం. ఉండడం, వెళ్ళిపోవడం ఇక మా ఇష్టమే; ఆతృతతో వేసుకున్న రేపటి మా పథకాలు వాటి లక్ష్యం తప్పాయి; ఇక ఈ రాత్రికి ఊరు వదిలినా, రేపు ఉదయందాకా నిరీక్షించినా…