రెండుచేతులతో పెనవేసుకుని కొండలతో సహా నిలబడడానికీ,
భయాన్ని దూరంగా ఉంచడానికీ, గదిలో గది,
గదిలో గదిగా, ప్రేమకి నేల ఆసరా ఉంది
కానీ ఊహకి అలాంటి అవసరమేమీ లేదు,
ఎందుకంటే దానికి భయమెరుగని రెండు రెక్కలున్నాయి.
మంచులోనూ, ఇసుకలోనూ, పచ్చికమీదా
నేను ప్రేమ విడిచిన పదముద్రలు చూశాను
ప్రపంచపు బిగికౌగిటిలో అవి ఉక్కిరిబిక్కిరి అవుతూ…
ప్రేమ అంటే అదే, దానికి అలా ఉండడమే ఇష్టం.
కానీ ఊహకి కాళ్ళు ఒకచోట నిలువవు.
ఊహ తారానివహాలమధ్యనున్న చీకట్లు చీలుస్తూ
రాత్రల్లా “సిరియస్” నక్షరూపురేఖలే గమనించగలదు,
ప్రతి పండ్లచెట్టుమీదా ముగ్గిన ఫలాల ఘుమఘుమలతో
తొలిసంజవెలుగులు తన ఆలోచనలని వెనక్కి మరలించేదాకా
తిరిగి సూర్యుడు తన రాత్రిగృహం చెరుకునేదాకా.
ఆకాసాన్ని పరిశీలించడం వల్ల వచ్చేలాభాలు వాటికవే.
కానీ, కొందరు దానికి బానిసలై ప్రేమే గొప్పని
ఉన్నచోటనే ఉండి అన్నీ పొందడానికి ప్రయత్నిస్తారు.
అందమైన ఊహలు అనేకం విహరించడంవల్ల కలిగే లాభం
ఏ ఒక్క నక్షత్రానికో అంటిపెట్టుకున్నదానికంటే ఎక్కువ.
.
రాబర్ట్ ప్రాస్ట్
(March 26, 1874 – January 29, 1963)
అమెరికను కవి.

Image Courtesy:
http://upload.wikimedia.org
స్పందించండి