సానుభూతి… పాల్ లారెన్స్ డన్ బార్, అమెరికను కవి

పాపం! పంజరంలోని పిట్టకి ఎలా ఉంటుందో నాకు తెలుసు.

మిట్టలమీది వంపుల్లో సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నప్పుడు

లేలేత గడ్డిమొలకల్లో గాలి మెత్తగా కదులుతున్నపుడు,

గాజుప్రవాహంలా నది తరళంగా పరిగెత్తుతున్నపుడు,

తొలిపికము పాడినపుడు, తొలిమొగ్గ విరిసినపుడు

దాని కలశంలోని మంద్రపరిమళం అంతరించినపుడు

పాపం, పంజరంలోని పిట్టకి ఎలా ఉంటుందో నాకు తెలుసు.

ఎర్రని తన రెక్కల రక్తం జాలిలేని తీగలపై గడ్డకట్టేదాకా

పంజరంలోని పిట్ట ఎందుకురెక్కలు కొట్టుకుంటుందో నాకు తెలుసు.

అది తిరిగి తనకొమ్మపైకి ఎగిరి వాలాలి, తను ఆనందంతో

ఊగుతున్నపుడు పడిపోకుండా గట్టిగా పట్టుకోవాలి;

పాతగాయాల మచ్చల్లో నొప్పి ఇంకా సలుపుతూనే ఉంటుంది —

అది సరికొత్తగా, మరింతసూదిగా పొడిచినట్టుంటుంది.

అది రెక్కలెందుకు కొట్టుకుంటుందో నాకు తెలుసు.

ఆహ్!  పంజరంలోని పిట్ట ఎందుకు పాడుతుందో నాకు తెలుసు.

తను స్వేచ్ఛగా బయటపడడానికి పంజరం గోడలు కొట్టికొట్టి

దాని రెక్కకి గాయమై, గుండె ఒరిసిపోయినపుడు,

అది ఆనందంతోనో, పట్టలేని సంతోషంతోనో కాదు,

దాని హృదయాంతరాళాలనుండి వినిపిస్తున్న ప్రార్థన అది

పైన స్వర్గంలో ఉన్నవానికి అది పెట్టుకుంటున్న మొర.

నాకు తెలుసు పంజరంలోని పిట్ట ఎందుకు పాడుతుందో!

.

పాల్ లారెన్స్ డన్ బార్

(June 27, 1872 – February 9, 1906)

ఆఫ్రికన్- అమెరికను కవి, నాటక కర్త, నవలాకారుడు.

Paul Laurence Dunbar

.

Sympathy

I know what the caged bird feels, alas!

When the sun is bright on the upland slopes;

When the wind stirs soft through the springing grass,

And the river flows like a stream of glass;

When the first bird sings and the first bud opes,

And the faint perfume from its chalice steals—

I know what the caged bird feels!

I know why the caged bird beats his wing

Till its blood is red on the cruel bars;

For he must fly back to his perch and cling

When he fain would be on the bough a-swing;

And a pain still throbs in the old, old scars

And they pulse again with a keener sting—

I know why he beats his wing!

I know why the caged bird sings, ah me,

When his wing is bruised and his bosom sore,—

When he beats his bars and he would be free;

It is not a carol of joy or glee,

But a prayer that he sends from his heart’s deep core,

But a plea, that upward to Heaven he flings—

I know why the caged bird sings!

.

Paul Laurence Dunbar

(June 27, 1872 – February 9, 1906)

American Poet, Novelist, Playwright

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Sympathy.htm

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: