రోజు: మే 17, 2017
-
సానుభూతి… పాల్ లారెన్స్ డన్ బార్, అమెరికను కవి
పాపం! పంజరంలోని పిట్టకి ఎలా ఉంటుందో నాకు తెలుసు. మిట్టలమీది వంపుల్లో సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నప్పుడు లేలేత గడ్డిమొలకల్లో గాలి మెత్తగా కదులుతున్నపుడు, గాజుప్రవాహంలా నది తరళంగా పరిగెత్తుతున్నపుడు, తొలిపికము పాడినపుడు, తొలిమొగ్గ విరిసినపుడు దాని కలశంలోని మంద్రపరిమళం అంతరించినపుడు పాపం, పంజరంలోని పిట్టకి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎర్రని తన రెక్కల రక్తం జాలిలేని తీగలపై గడ్డకట్టేదాకా పంజరంలోని పిట్ట ఎందుకురెక్కలు కొట్టుకుంటుందో నాకు తెలుసు. అది తిరిగి తనకొమ్మపైకి ఎగిరి వాలాలి, తను…