రోజు: మే 15, 2017
-
ప్రభాత గీతం… కార్ల్ విల్సన్ బేకర్, అమెరికను కవయిత్రి
ఆ కొండ చిగురున లేలేత వెలుగు ప్రసరిస్తోంది అక్కడెక్కడో ఒక పచ్చని చామంతి కనిపిస్తోంది, మరెక్కడో అంతకంటే తీయని మధువు ఆస్వాదించబడుతోంది. కొన్ని శిలలుగా ఉండిపో నిర్ణయించబడ్డాయేమో! తమకి తెలిసిన విషయాలే తెలుసుకుంటూ తమ ఆత్మలోకి మరింత గాఢంగా నాటుకుంటూ… కానీ, కొన్ని నన్నూ చిరుగాలినీ అనుసరించవలసిందే మేమెప్పుడూ స్వేచ్ఛగా, విహరించడానికి సిద్ధంగా ఉంటాం, భవిష్యంత ఆశావహంగా ఇంకెన్నడూ ఉండలేదు! . కార్ల్ విల్సన్ బేకర్ (1878–1960) అమెరికను కవయిత్రి. Photo Courtesy: Wikipedia .…