ఓ ఉదాత్త హృదయా! మనిద్దరం ఒకలా లేము, ఒకలా లేము
మన విధివ్రాతలూ, మన మనుగడలూ ఒక్కటి కావు.
మన ఆత్మల్ని పరిరక్షించే దేవదూతలు ఎదురుపడినపుడు
రెక్కలల్లార్చి ఒకరినొకరు తేరిపారి చూసుకుంటారు
ఆశ్చర్యంతో; నా ఉద్దేశ్యంలో నువ్వు మహరాణులు హాజరయే
సామాజిక సంబరాలలో వారికి అతిథిగా వెళ్ళగల యోగ్యుడివి,
కేవలం కన్నీళ్ళు కార్చడం తప్ప వేరేరుగని నా కళ్ళకంటే
ఎంతో వందల తేజోవంతమైన కళ్ళు రెప్పలార్పకుండా నిను చూస్తాయి
నువ్వు ప్రముఖ సంగీతకారుడిపాత్ర నిర్వహించినపుడు. వన్నె వన్నెల
దీపాల వెలుగుల్లోంచి నువ్వు నన్ను చూస్తే నీ కొరిగేదేముంది?
తమాలవృక్షానికి ఆనుకుని నేను చీకటిరాత్రిలో పాడుకునే
ఒకానొక అలసిన, దీన, నిలువనీడలేని గాయనిని…
నీ శిరసుపై పవిత్ర అభిషేకజలం; నా శిరసున హిమపాతం —
ఈ రెంటికీ సమానత సాధించగలిగినది ఒక్క మృత్యువే!
.
ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్
6 March 1806 – 29 June 1861
ఇంగ్లీషు కవయిత్రి .

https://www.poets.org/poetsorg/poet/elizabeth-barrett-browning
స్పందించండి