మీరు ఇది చదువుతుంటే, ధృవాలలో ఒక తెల్లని ఎలుగు తెల్లని మంచుని కాషాయరంగులో ముంచుతూ మూత్రాన్ని విసర్జిస్తుంది.
మీరిది చదువుతుంటే చాలామంది దేవతలు వృక్షాలనల్లుకున్న లతలలో దాక్కుంటారు; గాజులామెరిసేకళ్లు తరాల పచ్చని ఆకులని వీక్షిస్తుంటాయి.
మీరిది చదువుతుంటే ఆ సముద్రం అలలు ఎగదోస్తుంటుంది భీకరమైన తన అలల్ని ఎగదోస్తుంటుంది. . డెనిస్ లెవర్టోవ్ (24 October 1923 – 20 December 1997) బ్రిటిషు కవయిత్రి
స్పందించండి