అనువాదలహరి

ఏరోన్ స్టార్క్… E.A. రాబిన్సన్, అమెరికను

పైగా, ఏరోన్ స్టార్క్ చాలా బక్కపలచని మనిషి, శాపగ్రస్తుడు;
మురికిగా, శుష్కించి, ఎప్పుడూ ఏదోపోయినట్టు, తగువులాడుతూ ఉంటాడు.
అతనొక పిసినారి, తగ్గట్టే ముక్కుకూడా ఉందా లేదా అన్నట్టు ఉంటుంది,
అతని కళ్ళు చీకట్లో చిరునాణేల్లా ఉంటాయి.
అతని గీతగీసినట్టున్న నోరు అక్కడొక ఆనవాలులా ఉంటుంది;
అతను మాటాడినపుడు నోటంట వచ్చే ఆ రెండుమూడు శబ్దాలూ
ఎడమైనకోరలమధ్యనుండి కోపంతో వచ్చే బుసలా ఉండి,
కుక్క దాని అరుపుకే భయపడి జాగ్రత్తపడినట్టు ఆగిపోతాయి.

అతనికున్న చెడ్డపేరుకి సంతోషిస్తూనే
ప్రేమచేబహిష్కృతుడైన అతడు కర్రపట్టుకుని
ఊరంతా విచ్చలవిడిగా తిరుగుతుంటాడు;
అప్పుడప్పుడు అతని చెవుల్లోకి ఎక్కడో దూరాన్నుండి
జొరబడిన అజ్ఞాత కరుణార్ద్రమైన మాటలు మనసుతాకి,
కళ్ళు చెమర్చినపుడు, అప్పుడే, ఏరోన్ ఒక చిరునవ్వు నవ్వుతుంటాడు.
.

E. A. రాబిన్సన్

(December 22, 1869 – April 6, 1935)

అమెరికను

.

 

.

Aaron Stark

Withal a meagre man was Aaron Stark,

Cursed and unkempt, shrewd, shrivelled, and morose.

A miser was he, with a miser’s nose,

And eyes like little dollars in the dark.

His thin, pinched mouth was nothing but a mark;

And when he spoke there came like sullen blows

Through scattered fangs a few snarled words and close,

As if a cur were chary of its bark.

Glad for the murmur of his hard renown,

Year after year he shambled through the town,

A loveless exile moving with a staff;

And oftentimes there crept into his ears

A sound of alien pity, touched with tears,—

And then (and only then) did Aaron laugh.

E.A. Robinson

(December 22, 1869 – April 6, 1935)

American

(Winner of 3 Pulitzer Prizes and nominated for Nobel 4 times)

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Aaron-Stark.htm

 

 

 

నీలిదుస్తుల విద్యార్థినులు … జాన్ క్రో రాన్ సమ్, అమెరికను

మీ నీలి గౌన్లను గిరగిర తిప్పుకుంటూ, మీ బడిని
ఆనుకున్న పచ్చనిపొలాలలో నడుచుకుంటూ
మీ గురువృద్ధులు చెప్పింది వినండి పిల్లలూ; కానీ,
అందులో ఒక్కముక్కకూడా నమ్మకండి.

మీ తలకట్టు చుట్టూ తెల్లని కేశబంధాల్ని తగిలించి,
గడ్డిమీద ఎగురుకుంటూ ఉబుసుపోకమాటలు
చెప్పుకునే నీలి నీలి పిట్టల్లా
ఇక జరగబోయేదానికి ఆలోచించడం మానెయ్యండి.

ఇదిగో నీలి దుస్తుల అమ్మాయిలూ, అంతరించకమునుపే
మీ చక్కదనాన్ని సాధనచెయ్యండి. నేను పెద్ద గొంతుకతో
నలుగురికీ ప్రకటిస్తాను:దాన్ని మన అధీనంలోని సమస్త శక్తులూ
నిర్ణయించలేవని. చక్కదనం మహా దుర్బలమైనది.

ఎందుకంటే, మీకు నేనొక జరిగిన కథ చెప్తాను:
నాకు బాగా పెద్దగొంతుకపెట్టుకుని అరిచే స్త్రీ గురించి తెలుసు,
కళ్ళంట నీళ్ళతో ఆమె ఆకాశంనుండి క్రిందకి పడేది. 
అతితక్కువసమయంలోనే ఆమె చక్కదనాలన్నీ కనుమరుగయేవి…
అయితేనేం, ఆమె మీలో ఎవరికన్నాకూడా చూడచక్కనిది.
.

జాన్ క్రో రాన్ సమ్
(April 30, 1888 – July 3, 1974)
అమెరికను విమర్శకుడు, మేధావి.

Blue Girls

Twirling your blue skirts, travelling the sward

Under the towers of your seminary,

Go listen to your teachers old and contrary

Without believing a word.

Tie the white fillets then about your hair

And think no more of what will come to pass

Than bluebirds that go walking on the grass

And chattering on the air.

Practise your beauty, blue girls, before it fail;

And I will cry with my loud lips and publish

Beauty which all our powers shall never establish,

It is so frail.

For I could tell you a story which is true;

I know a lady with a terrible tongue,

Blear eyes fallen from blue,

All her perfections tarnished—yet it is not long

Since she was lovelier than any of you.

.

John Crowe Ransom

(April 30, 1888 – July 3, 1974)

American  Educator, scholar and Critic

 

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Blue-Girls.htm

 

జానపదగీతిక … ఎజ్రా పౌండ్, అమెరికను కవి

వెలుగు ఆమె హేలగా మారి, కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ

మనుషాకృతుల్లో ఎన్నో క్రీనీడలను ప్రాకిస్తోంది. 

చూడు, వెలుగు మనసు దోచి మనచే ఎలా కూనిరాగాలు తీయిస్తోందో! 

ఆమె క్షణకాలం సూర్యుడి వెలుగుని ధరిస్తుంది

నా మనసు ఎన్నడో ఆమె అధీనమైపోయింది .

కీకారణ్యాల్లో ఏ జింకపిల్లలూ, దుప్పులూ సంచరించవు

అంత నిశ్శబ్దంగా ప్రాకుతోంది సూర్యరశ్మి;

ఆమె నడుస్తున్నంత మేరా, తలవాల్చిన పచ్చిక మీద

మెరుస్తున్న పచ్చలు ఎక్కడ త్వరగా ఇగిరిపోతాయోనని సూరీడు

వాటిని క్రిందకి తరుముతున్నాడు; సాలీడు సైతం

ఆమె అంత నాజూకుగా, సన్నగా తన పట్టునెయ్యలేదు.

.

ఎజ్రా పౌండ్

(30 October 1885 – 1 November 1972)

అమెరికను కవి .

Ezra Pound
Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:Ezra_Pound_2.jpg

.

Ballatetta *

The light became her grace and dwelt among

Blind eyes and shadows that are formed as men;

Lo, how the light doth melt us into song:

The broken sunlight for a healm* she beareth

Who has my heart in jurisdiction.

In wild-wood never fawn nor fallow* fareth

So silent light; no gossamer* is spun  

So delicate as she is, when the sun

Drives the clear emeralds from the bended grasses

Lest they should parch too swiftly, where she passes.

Ezra Pound 

(30 October 1885 – 1 November 1972)

American Poet and Critic

[Notes:   Ballatetta = “little ballad” in Italian

                  healm = helm

                 fallow = a type of deer

                gossamer = spider web]

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Ballatetta.htm

యువ వీరులకు నివాళి… విల్ఫ్రెడ్ ఓవెన్ , ఇంగ్లీషు కవి

సొమ్ముల్లా రాలిపోయిన ఈ యువతకి ఇవేమి మృత్యుఘంటికలు?!

అవి భయానకమైన శతఘ్నుల కోపోద్దీపితమైన అరుపులు మాత్రమే

డగడగ…డగడగమని ఆగకుండా తూటాలు విరజిమ్మే తుపాకుల

చప్పుడు మాత్రమే వారి కడసారి ప్రార్థనలు త్వరగా వల్లెవేయగలదు.

వారిని శ్లాఘిస్తూ ఏ ఉపన్యాసాలూ లేవు; ఏ ప్రార్థనలూ, గంటలూ లేవు.

ఈ విషాద సంగీతం తప్ప వేరు శోక సంకేతాలు లేవు.

అవిగో కీచుగా, పిచ్చిపట్టినట్టు శోకించే తూటాల ఆక్రందనలు,

యువవీరులని జన్మభూమికి రారమ్మంటున్న తుత్తారల గద్గద నిస్వనాలు.

వారికి అంతిమ వీడ్కోలు ఇవ్వడానికి మనం ఏకొవ్వొత్తులు చూపగలం?

అవి ఆ పిల్లల చేతులలో లేవు, వాళ్ళ కళ్ళల్లో ఉన్నాయి

అవి కడసారి వీడ్కోలు ఇస్తూ దివ్యంగా వెలుగుతున్నాయి.

వెలవెలబోయిన వారిస్త్రీల ఫాలభాగాలే వాళ్ళకి నల్లని ముసుగులు

ఎంతో భవితకలిగిన వారి మెదళ్ళ సౌకుమార్యమే వారికి పూలజల్లు

నెమ్మదిగా అస్తమిస్తున్న ప్రతిసాయంత్రమూ వారిపై మూసుకుంటున్న చీకటితెర.

.

విల్ఫ్రెడ్ ఓవెన్

(18 March 1893 – 4 November 1918)

ఇంగ్లీషు కవి

 .

 

.

Anthem for Doomed Youth

What passing-bells for these who die as cattle?

Only the monstrous anger of the guns.

Only the stuttering rifles’ rapid rattle

Can patter out their hasty orisons.

No mockeries now for them; no prayers nor bells,

Nor any voice of mourning save the choirs,—

The shrill, demented choirs of wailing shells;

And bugles calling for them from sad shires.

What candles may be held to speed them all?

Not in the hands of boys, but in their eyes

Shall shine the holy glimmers of good-byes.

The pallor of girls’ brows shall be their pall;

Their flowers the tenderness of patient minds,

And each slow dusk a drawing-down of blinds.

Wilfred Owen

(18 March 1893 – 4 November 1918)

English Poet and Soldier

Poem Courtesy:

http://www.poemtree.com/poems/AnthemForDoomedYouth.htm

ఏ రోజుకి ఆ రోజు బ్రతుకు… జోస్ వాండర్లీ దీయాస్, పోర్చుగీసు కవి.

నువ్వు గ్రహించగలిసినదంతా గ్రహించు…
ప్రతి రోజూ… ప్రతి క్షణమూ…
ప్రతి ౠతువూ… నీ జీవించినంతకాలమూ.
అప్పుడు భవిష్యత్తులోకి ధైర్యంగా చూడగలవు
గతాన్ని విచారంలేకుండా అవలోడనంచేసుకోగలవు.
నువ్వు నీలాబ్రతుకు, కానీ నీలోని ఉత్తమోత్తమపార్శ్వాన్ని చూపు.
భిన్నంగా ఉండడానికి సాహసించు; నీ భవిత నువ్వే వెతుక్కో…
ఆనందంగా ఉండడానికి ఎంతమాత్రం వెరవకు!
సౌందర్యాన్ని ఆస్వాదించు.
ప్రతిదాన్నీ మనసారా, హృదయపూర్వకంగా ప్రేమించు.

నిన్ను ప్రేమించేవారిపై నమ్మకం ఉంచు.
ఒక నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్నప్పుడు,
నిర్ణయాన్ని ఎంత వివేకంతో, తొందరగా తీసుకోగలవో,
అంత వివేకంతో, త్వరగా తీసుకుని ఆ విషయం మరిచిపో.
నిస్సందేహంగా తీసుకోగల క్షణం ఎన్నడూ రాదు.
అన్నిటికన్నా ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకో: 
భగవంతుడు పరులకి సాయంచేసినవారికే సాయంచేస్తాడు.
అన్నీ నీ మీదే ఆధారపడి ఉన్నట్టు ప్రవర్తించు;
అన్నీ భగవంతునిమీదే ఆధారపడి ఉన్నట్టు ప్రార్థించు.
ఎప్పుడూ ఆనందంగా ఉండు.

.

జోస్ వాండర్లీ దీయాస్

పోర్చుగీసు కవి.

.

Live every day as much

  .

Take everything you can …
every hour … each day….
each season of your life.
So you can look forward with confidence and
back without resentment.
Be yourself, but the best of you!
Dare to be different and follow your own star …
And do not be afraid to be HAPPY!
Enjoy what is beautiful.
Love with all your heart and your soul.

Believe those who love you.
When you’re ahead of a decision,
take it as wisely and as quickly as possible
and then forget.
The moment of absolute certainty never arrives.
Overall, remember that
God helps those who help.
Behave as if everything depended on you and
Pray as if everything depends on God.
And Be Happy

.

(From the book: Why charm, but for now )

Jose Wanderley Dias

Portuguese Poet

ఓ నా మిత్తికా! నువ్వూ గతించవలసిందే!… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే అమెరికను కవయిత్రి

ఓ నా ప్రియ మిత్తికా! నువ్వూ గతించవలసిందే!
ఇంత నీ సౌందర్యమూ నిన్ను ఎంతమాత్రం కాపాడలేదు;
ఎక్కడా లోపం కనరాని ఈ నిపుణ హస్తమూ, అందమైన శిరసూ,
జ్వలించే ఉక్కులాంటి ఈ శరీరమూ, సుడిగాలివంటి
మృత్యువు ముందు, లేదా దానీ హేమంత హిమపాతం ముందు,
ఏ ఆకు రాలడానికి భిన్నంగా లేకుండా, మొట్టమొదటి ఆకు రాలినట్టు
రాలిపోక తప్పదు; ఈ అద్భుతం తెరమరుగుకాక తప్పదు…
మార్పుకిలోనై, అందరికీ దూరమై, చివికి శిధిలమై.
ఆ సమయంలో నా ప్రేమకూడా నిన్ను రక్షించలేదు.
ఇంత నా ప్రేమ నిన్ను వెన్నంటి ఉన్నా, ఆ రోజు నువ్వు
శరీరంనుండి లేచి వాయుమార్గంలో ప్రయాణం చేస్తావు …
ఎవ్వరూ పట్టించుకోని పువ్వులా ఏ గుర్తింపూ లేకుండా.
నువ్వు ఎంత అందంగా ఉన్నావన్నది అక్కడ ప్రశ్నేకాదు
మరణించింది అన్నిటికంటే ఎంత ప్రియమైనదన్నదీ కాదు.

.

ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే

(February 22, 1892 – October 19, 1950)

అమెరికను కవయిత్రి

.

.

And You as Well Must Die, Beloved Dust

And you as well must die, beloved dust,

And all your beauty stand you in no stead;

This flawless, vital hand, this perfect head,

This body of flame and steel, before the gust

Of Death, or under his autumnal frost,

Shall be as any leaf, be no less dead

Than the first leaf that fell,—this wonder fled.

Altered, estranged, disintegrated, lost.

Nor shall my love avail you in your hour.

In spite of all my love, you will arise

Upon that day and wander down the air

Obscurely as the unattended flower,

It mattering not how beautiful you were,

Or how beloved above all else that dies.

Edna St. Vincent Millay

(February 22, 1892 – October 19, 1950)

American Poet

Poem Courtesy: 

http://www.poemtree.com/poems/And-You-As-Well-Must-Die.htm 

ఆ కొండ… ఎడ్గార్ లీ మాస్టర్స్, అమెరికను కవి

ఎల్మర్, హెర్మన్, బెర్త్, టామ్, ఛార్లీ అంతా ఏరీ,
స్థిరచిత్తం లేని వాళ్లూ, భుజబలం కలిగినవాళ్ళూ, హాస్యగాడూ,
తాగుబోతూ, యోధుడూ…ఏరీ?
అందరూ… అందరూ ఆ కొండమీద నిద్రిస్తున్నారు.

ఒకరు జ్వరంతో పోయారు
ఒకరు గనిలో కాలిపోయారు
ఒకరు తగవులాటలో మరణించేరు
మరొకరు చెరసాలలో మరణించేరు.
భార్యాబిడ్డల్ని పోషించడానికి పనిచేస్తూ మరొకరు వంతెనమీంచి జారిపోయారు
వాళ్ళంతా… అంతా… ఇప్పుడు ఆ కొండమీద నిద్రిస్తున్నారు.

ఎలా, కేట్, మేగ్, లిజ్జీ, ఎడిత్ వీరంతా ఏరీ.
మెత్తని మనసూ, అమాయకత్వం, గయ్యాళితనం, గర్వం, ప్రశాంతత ఉన్నవీళ్ళేరీ?
అందరూ… అందరూ ఆ కొండమీద నిద్రిస్తున్నారు.

ఒకరు, చెప్పాలంటే సిగ్గుచేటు, ప్రసవసమయంలో పోయారు
ఒకరు ప్రేమలో మోసగించబడితే,
ఒకరు వేశ్యాగృహంలో విటుడి చేతిలో,
ఒకరు మనసైనది వెతుక్కుంటూ, సాధించలేకపోయిన అవమానంతో మరణిస్తే
లండన్, పారిస్ మహానగరాల జీవితానికై పరుగుతీస్తున్న మరొకరిని
ఎలా, కేట్, మేగ్ తమ చిన్న ఊరికి వెతికి తీసుకొచ్చారు
చివరకి అంతా… అంతా ఆ కొండమీద నిద్రిస్తున్నారు.

ఐజాక్ మామ, ఎమిలీ అత్తా ఏరీ?
పట్టణంలోఎక్కువ బతికిన ముసిలి కింకైడూ, సెవిన్ హౌటనూ ఏరీ?
విప్లవవీరులతో మాటాడిన ప్రఖ్యాతి గలిగిన
మేజర్ వాకర్ ఏడీ?
అంతా… అంతా ఇప్పుడు ఆ కొండమీద నిద్రిస్తున్నారు.

కొందరు యుధ్ధంలో మరణించిన వీరపుత్రుల్ని తీసుకొచ్చారు
కొందరు జీవితం విచ్ఛిన్నం చేసిన కూతుళ్ళనీ
రోదిస్తున్న, అనాధలైన వాళ్ళ పిల్లల్నీ తెచ్చుకున్నారు.
ఇప్పుడంతా… అంతా ఆ కొండమీదే నిద్రిస్తున్నారు.

మంచుపడుతున్నా పైమీదబట్టలేకుండా
త్రాగుతూ, అరుస్తూ, పెళ్ళాం పిల్లల మాటలేకుండా
డబ్బూ, ప్రేమా, స్వర్గనరకాల ఊసులేకుండా
తను జీవించిన తొభై ఏళ్ల కాలమూ
ఫిడేలు వాయిస్తూనే బ్రతికిన ముదివగ్గు జోన్స్ ఏడీ?
అడుగో చూడండి, ఏనాటివో చేపల వేపుళ్ళుగురించీ
క్లారీ తోటలో జరిగిన గుర్రప్పందాలగురించీ
ఒకప్పుడు స్ప్రింగ్ ఫీల్డ్ల్లో
అబ్రహాం లింకన్ ఏమన్నాడో … నిద్రలో ఏదో వల్లిస్తున్నాడు.
.
ఎడ్గార్ లీ మాస్టర్స్
(August 23, 1868 – March 5, 1950)
అమెరికను కవి

 

.

The Hill

Where are Elmer, Herman, Bert, Tom and Charley,

The weak of will, the strong of arm, the clown,

the boozer, the fighter?

All, all, are sleeping on the hill.

One passed in a fever,

One was burned in a mine,

One was killed in a brawl,

One died in a jail,

One fell from a bridge toiling for children and wife—

All, all are sleeping, sleeping, sleeping on the hill.

Where are Ella, Kate, Mag, Lizzie and Edith,

The tender heart, the simple soul, the loud, the proud, the happy one?—

All, all, are sleeping on the hill.

One died in shameful child-birth,

One of a thwarted love,

One at the hands of a brute in a brothel,

One of a broken pride, in the search for heart’s desire,

One after life in far-away London and Paris

Was brought to her little space by Ella and Kate and Mag—

All, all are sleeping, sleeping, sleeping on the hill.

Where are Uncle Isaac and Aunt Emily,

And old Towny Kincaid and Sevigne Houghton,

And Major Walker who had talked

with venerable men of the revolution?—

All, all, are sleeping on the hill.

They brought them dead sons from the war,

And daughters whom life had crushed,

And their children fatherless, crying—

All, all are sleeping, sleeping, sleeping on the hill.

Where is Old Fiddler Jones

Who played with life all his ninety years,

Braving the sleet with bared breast,

Drinking, rioting, thinking neither of wife nor kin,

Nor gold, nor love, nor heaven?

Lo!  he babbles of the fish-frys of long ago,

Of the horse-races of long ago at Clary’s Grove,

Of what Abe Lincoln said

One time at Springfield.

Edgar Lee Masters

(August 23, 1868 – March 5, 1950

American Poet, Attorney, biographer and dramatist

Poem Courtesy:

http://www.poemtree.com/poems/TheHill.htm

(In 1915, Edgar Lee Masters published The Spoon River Anthology, a book of 244 poems spoken by the deceased residents of Spoon River (a rural area in Illinois) from their graves on “the hill”.  The book created a stir because many of the supposedly fictional speakers were recognizable as real people.  The poems are remarkable for the breadth of personalities and the honesty with which they speak.  All the poems were written in free verse, which puts them outside the scope of this “formalist” anthology.  Nonetheless, I include some here because they are moving and haunting.  These poems are food for my spirit like no other.  I recommend this book more strongly than any other book of poetry…  Editor, Poem Tree … an anthology of metered verse. )

మనసా! కాస్త నెమ్మది… A E హౌజ్మన్, ఇంగ్లీషు కవి

ఓ మనసా! కాస్త నెమ్మది వహించు; నీ అస్త్రాలు ఎందుకూ పనికిరావు,
భూమ్యాకాశాల దగ్గర ఇంతకన్నా బలమైనవి ఎప్పటినుండో స్థిరంగా ఉన్నాయి.
ఆలోచించు. ఒకసారి గుర్తుతెచ్చుకో, ఇప్పుడు నువ్వు విచారిస్తున్నావు గాని,
ఒకప్పుడు మనం అచేతనంగా పడి ఉండే వాళ్ళం. ఆ రోజులు అనంతం.

అప్పుడూ మనుషులు నిర్దాక్షిణ్యంగా ఉండెవారు; ణెను ఆ చీకటి గుహలో
పడుకున్నాను అందుకు చూడలేదు; కన్నీళ్ళు చిందేవి, కానీ విచారించలేదు;
చెమట కారేది, రక్తం ఉడుకెత్తేది, కానీ నే నెన్నడూ విచారించలెదు;
నేను పుట్టకమునుపు ఆ రోజుల్లో అప్పటికది అంతా బాగానే ఉండేది.

ఇప్పుడు నేను కారణాలు వెతుకుతాను కానీ సమాధానం కనిపించదు,
నేను నేలనలుచెరగులా తిరుగుతాను, నిత్యం గాలిపీలుస్తూ, సూర్యుణ్ణి ఆనందిస్తాను
మనసా! కాస్త నెమ్మది వహించు: ఇదెన్నాళ్లుంటుది, క్షణికమే:
అన్యాయం జరిగితే జరగనీ, దాన్ని కొంతకాలం సహిద్దాము.

ఇదిగో చూడు! మిన్నూ మన్నూ పునాదులదగ్గరనుండి రుజాగ్రస్తమయ్యాయి.
మనసుని ముక్కలు చెయ్యగల అన్ని ఆలోచనలూ ఉన్నాయి; అవన్నీ నిష్ఫలం.
భీతి, ఏవగింపు, వెటకారం, భయం, పట్టలేని ఆగ్రహం —
అయ్యో! నేనెందుకు మేల్కొన్నాను? మళ్ళీ ఎప్పుడు నిద్రలోకి జారుకుంటాను?
.

ఏ. ఇ. హౌజ్మన్
(26 March 1859 – 30 April 1936)
ఇంగ్లీషు కవి .

.

Be Still, My Soul, Be Still

 .

Be still, my soul, be still; the arms you bear are brittle,

Earth and high heaven are fixt of old and founded strong.

Think rather,—call to thought, if now you grieve a little,

The days when we had rest, O soul, for they were long.

Men loved unkindness then, but lightless in the quarry

I slept and saw not; tears fell down, I did not mourn;

Sweat ran and blood sprang out and I was never sorry:

Then it was well with me, in days ere I was born.

Now, and I muse for why and never find the reason,

I pace the earth, and drink the air, and feel the sun.

Be still, be still, my soul; it is but for a season:

Let us endure an hour and see injustice done.

Ay, look: high heaven and earth ail from the prime foundation;

All thoughts to rive the heart are here, and all are vain:

Horror and scorn and hate and fear and indignation—

Oh why did I awake? when shall I sleep again?

A.E. Housman

(26 March 1859 – 30 April 1936)

English Classical Scholar and Poet

Poem courtesy:

http://www.poemtree.com/poems/BeStillMySoulBeStill.htm

తుదిశ్వాస విడిచిన తర్వాత… థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి

(జెమీమా హార్డీ (1813 – 1904)  స్మృతిలో )

.

ఇక చెయ్యడానికీ, భయపడడానికీ, ఆశించడానికీ ఏమీ లేదు; ఇక ఎవ్వరూ
కనిపెట్టుకుని ఉండనక్కరలేదు;చిన్నగొంతుతో మాటాడడాలూ, విసిగి వేసారడాలూ ఉండవు;
దుప్పటిమీద ఇబ్బందిగా కనిపించే ముడతలు సరిదిద్దనక్కరలేదు,
తలగడ ఆమెకు వాలులో పెట్టనక్కరలేదు.

మేము శూన్యదృక్కులతో చూస్తున్నాం. ఉండడం, వెళ్ళిపోవడం ఇక మా ఇష్టమే;
ఆతృతతో వేసుకున్న రేపటి మా పథకాలు వాటి లక్ష్యం తప్పాయి;
ఇక ఈ రాత్రికి ఊరు వదిలినా, రేపు ఉదయందాకా నిరీక్షించినా
పెద్ద తేడా పడదు.

అక్కడ స్పష్టంగా రాసి ఉన్న మందుల సీసాలు
‘మమ్మల్ని ఇక్కడ ఎందుకుంచారు?” అని అడుగుతున్నట్టున్నాయి;
ప్రతి నొప్పి నివారణమందూ తమ నిరుపయోగానికి
వెర్రిమొహం వేస్తున్నాయి.

అయినా ఇందులో ఏదో మేలు జరిగిన అనుభూతి మాకు కలుగుతోంది.
ఇన్నాళ్ళూ ఉగ్గబట్టుకున్న అచేతనకి ఉపశమనం దొరికినట్టుంది;
స్వల్ప కాల మాళిగలో బందీ అయిన మా ప్రేమాస్పదురాలు
ఇక లేదు.

ఒక్కటొక్కటిగా, తప్పుచేసిన మమ్మల్నందరినీ
ఆమె ఎంత నేర్పుగా తప్పించుకుందో తెలియవస్తోంది.
దానితో సరిపోల్చినపుడు క్షణికమైన ఈ వియోగము
చాలా చిన్నదిగా కనబడుతోంది.

.

థామస్ హార్డీ

(2 June 1840 – 11 January 1928)

ఇంగ్లీషు కవి

Image Courtesy: http://upload.wikimedia.org

.

After the Last Breath

(J.H. 1813–1904)*

 

There’s no more to be done, or feared, or hoped;

None now need watch, speak low, and list, and tire;

No irksome crease outsmoothed, no pillow sloped

        Does she require.

 

Blankly we gaze.  We are free to go or stay;

Our morrow’s anxious plans have missed their aim;

Whether we leave to-night or wait till day

        Counts as the same.

 

The lettered vessels of medicaments

Seem asking wherefore we have set them here;

Each palliative its silly face presents

        As useless gear.

 

And yet we feel that something savours well;

We note a numb relief withheld before;

Our well-beloved is prisoner in the cell

        Of Time no more.

 

We see by littles now the deft achievement

Whereby she has escaped the Wrongers all,

In view of which our momentary bereavement

        Outshapes but small.

 .

 

Thomas Hardy

(2 June 1840 – 11 January 1928)

English Novelist and Poet

* J.H. stands for  Jemima Hardy, his mother.  

Poem Courtesy:

http://www.poemtree.com/poems/After-The-Last-Breath.htm

దాస్యమూ- స్వాతంత్య్రమూ… రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి

రెండుచేతులతో పెనవేసుకుని కొండలతో సహా నిలబడడానికీ,
భయాన్ని దూరంగా ఉంచడానికీ, గదిలో గది,
గదిలో గదిగా, ప్రేమకి నేల ఆసరా ఉంది
కానీ ఊహకి అలాంటి అవసరమేమీ లేదు,
ఎందుకంటే దానికి భయమెరుగని రెండు రెక్కలున్నాయి.

మంచులోనూ, ఇసుకలోనూ, పచ్చికమీదా
నేను ప్రేమ విడిచిన పదముద్రలు చూశాను
ప్రపంచపు బిగికౌగిటిలో అవి ఉక్కిరిబిక్కిరి అవుతూ…
ప్రేమ అంటే అదే, దానికి అలా ఉండడమే ఇష్టం.
కానీ ఊహకి కాళ్ళు ఒకచోట నిలువవు.

ఊహ తారానివహాలమధ్యనున్న చీకట్లు చీలుస్తూ
రాత్రల్లా “సిరియస్” నక్షరూపురేఖలే గమనించగలదు,
ప్రతి పండ్లచెట్టుమీదా ముగ్గిన ఫలాల ఘుమఘుమలతో
తొలిసంజవెలుగులు తన ఆలోచనలని వెనక్కి మరలించేదాకా
తిరిగి సూర్యుడు తన రాత్రిగృహం చెరుకునేదాకా.

ఆకాసాన్ని పరిశీలించడం వల్ల వచ్చేలాభాలు వాటికవే.
కానీ, కొందరు దానికి బానిసలై ప్రేమే గొప్పని
ఉన్నచోటనే ఉండి అన్నీ పొందడానికి ప్రయత్నిస్తారు.
అందమైన ఊహలు అనేకం విహరించడంవల్ల కలిగే లాభం
ఏ ఒక్క నక్షత్రానికో అంటిపెట్టుకున్నదానికంటే ఎక్కువ.
.
రాబర్ట్ ప్రాస్ట్
(March 26, 1874 – January 29, 1963)
అమెరికను కవి.

Robert Frost

 

Image Courtesy: 

http://upload.wikimedia.org 

.

Bond and Free

.

Love has earth to which she clings

With hills and circling arms about—

Wall within wall to shut fear out.

But Thought has need of no such things,

For Thought has a pair of dauntless wings.

On snow and sand and turf, I see

Where Love has left a printed trace

With straining in the world’s embrace.

And such is Love and glad to be.

But Thought has shaken his ankles free.

Thought cleaves the interstellar gloom

And sits in Sirius’ disc all night,

Till day makes him retrace his flight,

With smell of burning on every plume,

Back past the sun to an earthly room.

His gains in heaven are what they are.

Yet some say Love by being thrall

And simply staying possesses all

In several beauty that Thought fares far

To find fused in another star.

Robert Frost

(March 26, 1874 – January 29, 1963)

American Poet

Poem courtesy:

http://www.poemtree.com/poems/BondAndFree.htm

%d bloggers like this: