ఇక్కడ ఈ ఉదయం… ఏలన్ డూగన్,అమెరికను

ఇది ఈ రోజు సరికొత్త ఉదయం:
గతరాత్రికి చెందిన కీర్తి అపకీర్తులు
గతించాయి, వాటి ప్రభావాలు మినహా ;
ఒకటవ, రెండవ ప్రపంచ మహాసంగ్రామాలూ,
ఎడ్వర్డు ఏడుతోనో, ఎనిమిదితోనో,
వాలిస్ వార్ ఫీల్డ్ సింప్సన్ వివాహమూ,
“పోప్” లకున్న క్రమసంఖ్యల్లా…
వరుస సంఖ్యలిచ్చిన రాకెట్లు …ఆకాశంలోనో
చంద్రమండలం మీదనో పేలిపోతాయి.
ఇక ఇప్పుడు ఒక కొత్త రోజు మొదలైంది.
ఈ రోజునీ, దాని చక్కని చుక్కల్నీ
తక్షణం హస్తగతం చేసుకోవాలి,
మతాధికారులు ఆరుబయట పాదచారుల
కాలిబాటల్ని శుభ్రపరుస్తున్నారు,
అద్దాలతలుపులు తెరువబడ్డాయి,
మొట్టమొదటిగా వచ్చిన ఖాతాదారులు
వాళ్ళ కనుకొలకుల సూపర్ మార్కెట్ల
వీధుల్లో యాంత్రికంగా వినిపించే సంగీతాన్ని
ఆస్వాదిస్తూ అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు.
ప్రతి వస్తువూ దాని సహజ ప్రకృతినుండి
వేరుచెయ్యబడి, మరొక వస్తువుగా
ముసుగువెయ్యబడి, ముక్కలు ముక్కలుగా
సుల్భంగా అమ్మబడుతోంది. రోమను అంకెలతో
ఎవ్వరు గుణించి, వశపరచుకోగలరు?
అరబ్బుల “సున్న” కున్న స్థానబలం లేకపోవడంతో
అవి వ్యవహారంలోంచి తప్పించబడ్డాయి.
రాత్రల్లా కసాయివాళ్లు గొర్రెపిల్లల్ని చంపి
వాటిని శుభ్రపరచి,
శుభ్రపడి, నిష్క్రమించారు.
తమకి స్పృహ ఉండగా రక్తాన్ని చూడని వాళ్లు
అది రంగుమారినా తాగగలరు,
పునరావృతం కాని పొరపాటుగా గతాన్ని వర్ణిస్తారు
ఎందుకంటే, వాళ్ళకి ప్రస్తుతం నడుస్తున్న
సర్కస్ లాంటి వాస్తవం అనుకోకుండా లభించిన వరం.
.
ఏలన్ డూగన్
అమెరికను కవి

.

This Morning Here

.

This is this morning: all

The evils and glories of last night

Are gone except for their

Effects: the great world wars

I and II, the great marriage

Of Edward the VII or VIII

To Wallis Warfield Simpson and

The rockets numbered like the Popes

Have incandesced in flight

Or broken on the moon: now

The new day with its famous

Beauties to be seized at once

Has started and the clerks

Have swept the sidewalks

To the curb, the glass doors

Are open, and the first

Customers walk up and down

The supermarket alleys of their eyes

To Muzak. Every item has

Been cut out of its nature,

Wrapped disguised as something

Else, and sold clean by fractions.

Who can multiply and conquer

By the Roman numbers? Lacking

The Arab frenzy of the zero, they

Have obsolesced: the butchers

Have washed up and left

After having killed and dressed

The bodies of the lambs all night,

And those who never have seen blood awake

Can drink it browned

And call the past an unrepeatable mistake

Because this circus of their present is all gravy.

.

Alan Dugan

12 Feb 1923 – 3 Sep 2003

American

Poem courtesy:

http://www.npr.org/2011/04/06/134745994/poetry-with-an-edge-the-acerbic-wit-of-alan-dugan

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: