స్వాప్నికుడు… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి

కలల కనుమల్లో ఒక స్వాప్నికుడు

అతన్ని పిచ్చివాడిగా పరిగణిస్తారు; అతనికి అదొకవెర్రి;

బక్కచిక్కి, వంగిన శరీరాన్ని కప్పి ఉంచిన

అతని ఉడుపుల మాసికలనుబట్టి అతన్ని విలువకడతారు.

ప్రతిరోజూ సూర్యుడు పడమటికొండ దిగగానే,

తీరికలేని నగర పొలిమేరలుదాటి, నింగీ నేలా కలిసే చోట

వంపులుతిరిగి, తీరికగా, సడిచేయక పారే సెలయేటి తీరాన

ఆ వింత మనిషి ప్రశాంతంగా అటూఇటూ తిరుగుతుంటాడు.

అతని చెవులబడే సంగీతం గురించి, ఆహ్!  ఏమని చెప్పను?!

ఆ కన్నులాలోకించే అద్భుతదృశ్యాలను ఏమని వర్ణించను?! 

అతనా పేదవాడు? ఎన్నటికీ కాదు. అతనికై మీరేడవకండి!

మేఘమాలికలూ, సెలయేళ్ళూ అతనికీదలచిన వరాలకై ఆలోచిస్తాయి

వాటి అపారమైన సంపదకి ప్రతిరోజూ అతను వారసుడు,

మరణిస్తున్న సూర్యుడు, తన బంగారాన్నతనికి వారసత్వంగా ఇస్తాడు.

.

ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్

1866-1925

అమెరికను కవయిత్రి, అనువాదకురాలు, చిత్రకారిణి 

 

The Dreamer

A Dreamer ever in the vale of dreams,

Poor was he called, so poor, and wholly mad;-

They judged him by the garment’s rusty seams

With which the bent and shrunken frame was clad.

And every evening as the sun sunk low,

Outside the busy town where earth met sky,

Near where a stream meandered soft and slow

That same strange form would wander slowly by.

And ah, the music heard by those keen ears,-

The wondrous pictures seen by those deep eyes!-

A pauper? – No. – Save not for him your tears.

The clouds and streams to him their gifts devise,

And he is heir each night to wealth untold,-

The dying sun bequeaths him all his gold.

.

Antoinette De Coursey Patterson

1866-1925

American

Poem Courtesy:

https://archive.org/stream/sonnetsquatrains00patt#page/8/mode/2up

HW Fisher & Company

Philadelphia

MDCCCCXIII

Page 8

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: